రాష్ట్రీయం

సాగర్ క్రస్ట్‌గేట్లను తాకిన వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయపురిసౌత్, అక్టోబర్ 18: నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ జలాశయమైన శ్రీశైలం నుంచి వరదనీటి ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో సాగర్ జలాశయం నిండుకుండలా కనిపిస్తోంది. గత 5 రోజుల నుంచి సాగర్ నీటిమట్టం శరవేగంగా పెరుగుతోంది. రెండు రోజుల్లోనే 10 అడుగుల మేర పెరిగి బుధవారం రాత్రికి 564.90 అడుగులకు చేరి నీరు క్రస్ట్‌గేట్లను తాకింది. గత 8 సంవత్సరాలుగా సాగర్ డ్యాం నీటిమట్టాన్ని పరిశీలిస్తే పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగుల చేరిన దాఖలాలు లేవు.
ప్రస్తుతం సాగర్ పరిసర ప్రాంతాలలో వర్షాలు లేకపోయినా కృష్ణా పరివాహక ప్రాంతాలలో కురుస్తున్న వర్షాల కారణంగా సాగర్ జలాశయానికి ప్రాణం వచ్చింది. గుంటూరు, కృష్ణా జిల్లాల కుడికాలువ ఆయకట్టు కింది సుమారు 20 లక్షల ఎకరాల పరిధిలోని అన్నదాతలకు ఆశలు చిగురించేలా చేసింది. సాగర్ గరిష్టస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 564.90 అడుగుల వద్ద ఉంది. ఇది 243.9104 టిఎంసిలకు సమానం. సాగర్ జలాశయం నుండి ఎస్‌ఎల్‌బిసి ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుండి సాగర్ జలాశయానికి 2,38,036 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 883.90 అడుగుల వద్ద కొనసాగుతుంది. ఇది 209.5944 టిఎంసిలకు సమానం. ఎగువ జలాశయాల నుండి శ్రీశైలం జలాశయానికి 1,81,785 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు సాగర్ ప్రాజెక్టు అధికారులు తెలిపారు.