రాష్ట్రీయం

ఐటిసిపై జనసేన దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 18: తెలుగు రాష్ట్రాల్లో నిశ్శబ్ద విప్లవానికి జనసేన సిద్ధమవుతోంది. ఎటువంటి హడావుడి లేకుండా వివిధ విభాగాలను ఏర్పాటు చేసుకుంటున్న జనసేన, సంస్థాగత వ్యవస్థలపై దృష్టిసారించింది. ప్రధానంగా పార్టీ నాయకత్వం అభిప్రాయాలను ప్రజల్లోకి నేరుగా తీసుకువెళ్లేందుకు సమాచార సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టిసారించింది. అలాగే వస్తున్న కార్యకర్తలను , నేతలను స్వాగతించి వారి పేర్లనువివరాలను నమోదు చేసే యంత్రాంగం, ఇంకో పక్క ఆన్‌లైన్‌లోనే పార్టీ కార్యకర్తలుగా చేరేందుకు జనసేన పోర్టల్‌ను ప్రారంభించింది. ప్రశాసన్ నగర్‌లో పార్టీ కార్యాలయానికి సమస్త హంగులను తీర్చిదిద్దుతోంది. నిన్నటివరకూ బోసిపోయినట్టు ఉన్న జనసేన పార్టీ ఇపుడు హైటెక్ హంగులతో మెరిసిపోతోంది. ఐటి హంగులను విస్తృత పరుస్తున్నారు. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాంలతో పాటు యూట్యూబ్‌లో ఏ రోజుకారోజు పార్టీ కార్యకలాపాలను నేరుగా కార్యకర్తలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ తన ప్రకటనలను, అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల వేదికగా వెలువరించేలా ఏర్పాట్లు జరిగాయి. హైదరాబాద్‌లోని జనసేన పార్టీ పరిపాలన కార్యాలయం కూడా అదనపు హంగులతో తీర్చిదిద్దారు. పార్టీ పరిపాలనా విభాగాలు అన్నీ ఇక మీదట ఇక్కడి నుండే సేవలు అందించనున్నాయి. ఇంత వరకూ పార్టీ ఏ ప్రకటన చేసినా పత్రికల్లో మాత్రమే కనిపించేది, అంతకంటే ముందే క్షణాల్లో పార్టీ యంత్రాంగానికి చేరేలా ఇపుడు పార్టీ వేగాన్ని అందుకుంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోనూ, తెలంగాణలోనూ ప్రధాన పట్టణాల్లో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పటికపుడు సమకాలీన అంశాలపై పార్టీ అధినేత స్పందనలను క్షేత్రస్థాయిలో తెలియపరిచి స్థానికంగా ఉన్న నేతల్లో ఎలాంటి అయోమయం లేకుండా చూసేందుకు జనసేన సమస్త ఏర్పాట్లు చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల రణ క్షేత్రంలోకి దూకేందుకు వీలుగా గ్రామస్థాయిలో పటిష్టమైన కార్యకర్తలను సిద్ధం చేసి వారితో నేరుగా టెలిఫోన్‌లో సంభాషించేలా కూడా చర్యలు తీసుకున్నారు. ప్రాధాన్య అంశాలపై పార్టీ పోర్టల్‌లో భిన్నాభిప్రాయాలతో పాటు పార్టీ వైఖరిని కూడా స్పష్టం చేయాలని చూస్తోంది. రానున్న రోజుల్లో జనసేన పూర్తి హంగులతో పనిచేస్తుందని పార్టీ ప్రతినిధి ఒకరు చెప్పారు.
పర్యావరణ హితంగా దీపావళి
పర్యావరణానికి హాని కలిగించని టపాసులతో ఈ దీపావళి వేడుక జరుపుకుంటే ప్రకృతితో పాటు అందరికీ క్షేమమని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. ముఖ్యంగా పిల్లలు టపాసులు కాల్చేటపుడు పెద్దలు తగిన శ్రద్ధ తీసుకోవాలని, అశ్రద్ధ పనికిరాదని ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి దేశ సంస్కృతికి అద్దం పడుతుందని అటువంటి దీపావళి పండుగ సందర్భంగా యావత్ తెలుగుజాతితో పాటు దేశ ప్రజలందరికీ తాను శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు ఆయన పేర్కొన్నారు.