రాష్ట్రీయం

వాయుగండం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బలపడుతున్న తీవ్ర అల్పపీడనం ఉత్తరాంధ్ర, సీమల్లో విస్తారంగా వర్షాలు
21 వరకూ వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు తుపానుకు అవకాశం లేదని వెల్లడి

విశాఖపట్నం, అక్టోబర్ 18: నైరుతి బంగాళాఖాతంలో గత 15న ఏర్పడిన అల్పపీడనం బుధవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి తీవ్ర అల్పపీడనంగా మారిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇది మరో 24 గంటల్లో అంటే, గురువారం ఉదయానికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండం గురువారం మధ్యాహ్నానికి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య సముద్ర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంటుందని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని చెప్పారు. దీని ప్రభావం వలన బుధవారం అర్ధరాత్రి దాటినప్పటి నుంచి ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఒడిశా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కూడా అవకాశం ఉంది. గంటకు 45 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లద్దని హెచ్చరించారు. ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులను వెనక్కు రప్పించాలని అధికారులకు సూచించారు. ఈ వాయుగుండం ప్రభావం వలన సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, తీరంలో కెరటాలు పెద్దఎత్తున లేచి పడతాయని చెప్పారు. కాగా, ఈ వాయుగుండం తుపానుగా మారే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు.

కంట్రోల్ రూం ఏర్పాటు

భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఉత్తరాంధ్రలోని కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. అలాగే గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థలో కూడా
24/7 కంట్రోల్ రూం తెరిచి ఉంచుతున్నారు. సంబంధిత అధికారులు అంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఉత్తరాంధ్రలోని తీర ప్రాంత గ్రామాల్లో రెవెన్యూ అధికారులను కలెక్టర్లు అప్రమత్తం చేశారు. అవసరమైతే సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.