రాష్ట్రీయం

శంషాబాద్ ఎయర్‌పోర్టుకు క్వాలిటీ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 18: జిఎంఆర్ సంస్థ నేతృత్వంలో పని చేస్తున్న రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రతిష్టాత్మక ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఎసిఐ), ఎయిర్‌పోర్టు సర్వీసెస్ క్వాలిటీ (ఎఎస్‌క్యూ) అవార్డు లభించింది. ఈ నెల 17న మారిషస్‌లోని పోర్టులూయిస్‌లో జరిగిన కార్యక్రమంలో ట్రోపిని బహూకరించారు. 2016లో ప్రయాణీకుల సంఖ్యకు సంబంధించిన స్కోరు 4.9కి పెరగడం, నాణ్యమైన సేవల అందించినందకుగాను ఈ ప్రతిష్టాత్మక ట్రోపి లభించిందని జిహెచ్‌ఐఎల్ సిఈఓ ఎస్‌జికె కిషోర్ తెలిపారు. ఈ ట్రోపి ద్వారా లభించిన అరుదైన గుర్తింపు ఖచ్చితంగా బ్రాండ్ హైదరాబాద్‌ను మెరుగుపరుస్తుందని తెలిపారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు కమ్యూనిటీ, సివిల్ ఏవియేషన్, సిఐఎస్‌ఎఫ్, ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్, రాయితీలు, హౌస్‌కీపింగ్, ఇతర సహాయ సిబ్బంది మిశ్రమ కృషి, ప్రయత్నం వల్లే ఈ అవార్డు లభించిందని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇదే రకమైన సహకారంతో ముందుకెళతామని అన్నారు.