రాష్ట్రీయం

లొంగిపోయిన డిఎస్పీ రవిబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 20: మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు కుమార్తె పద్మలత, రౌడీషీటర్ గేదెల రాజు హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్టీసీ విజిలెన్స్ డిఎస్పీ రవిబాబు చోడవరం పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం లొంగిపోయాడు. గేదెల రాజు హత్య కేసులో ఇప్పటికే రవిబాబు ఏ1గా ఉన్నాడు. పద్మలత అనుమానాస్పద కేసులో కూడా రవిబాబు ప్రధాన నిందితుడు. చోడవరంలోని దుర్గావిలాస్ వద్దకు ద్విచక్ర వాహనంపై వచ్చిన రవిబాబు పోలీస్ స్టేషన్‌కు కొద్దిపాటి దూరంలో వాహనం దిగి, పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. అప్పటికి స్టేషన్‌లో ఎస్‌ఐ మల్లేశ్వరరావు ఉన్నారు. కొద్దిసేపటికి సి.ఐ శ్రీనివాసరావు ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించారు. వెంటనే రవిబాబును విశాఖలోని న్యూ పోర్టు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

చిత్రం..ఆర్టీసీ విజిలెన్స్ డిఎస్పీ రవిబాబు