రాష్ట్రీయం

పోలవరాన్ని ఆపలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 20: ఎట్టిపరిస్థితుల్లోనూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపే ప్రసక్తిలేదని ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు స్పష్టం చేశారు. ఈ విషయంలో తమ ఆందోళనలు తీరేవరకూ ఈ బహుళార్థక నీటి పారుదల ప్రాజెక్టును నిలిపివేయాలంటూ ఒడిశా చేస్తున్న అభ్యర్థనను తాము పట్టించుకునేది లేదన్న సంకేతాలను ఆయన అందించారు. రాష్ట్ర నీటిపారుదల అవసరాలను గణనీయంగా తీర్చే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అన్ని రకాల అనుమతులను తమ ప్రభుత్వం పొందిందని ఆయన స్పష్టం చేశారు. అన్ని అనుమతులు పొందాం కాబట్టే ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆగదని ఉమ తేల్చిచెప్పారు. అయితే, రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు ఇతర రాష్ట్రాలను (చత్తీస్‌గఢ్, ఒడిశా) రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. పార్లమెంట్‌లో పోలవరం అంశాన్ని లేవనెత్తించడం ద్వారా దీన్ని అడ్డుకోవాలన్నదే వీరి ఆశయంగా కనిపిస్తోందని ఉమ అన్నారు. పోలవరానికి సంబంధించి తమ ఆందోళనలు
తీరేవరకూ దీన్ని ఆపాలంటూ ఈనెల 10న ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్ రాష్ట్ర ముఖ్యంమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు వల్ల తమ రాష్ట్రంలోని మల్కాన్‌గిరి జిల్లాపై పడే ప్రభావాన్ని పట్టించుకోకుండా దీని నిర్మాణం వేగంగా సాగుతోందని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. అలాగే, దీని నిర్మాణం గోదావరి నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ అవార్డుకు వ్యతిరేకంగా ఉందని కూడా నవీన్ తన లేఖలో పేర్కొన్నారు. తమవద్ద ఉన్న వివరాలను బట్టి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తదుపరి ఆమోదం తీసుకోకుండానే ఈ ప్రాజెక్టును ఆంధ్ర చేపడుతోందని కూడా నవీన్ పేర్కొన్నారు. అయినప్పటికీ తమ రాష్ట్ర ఆందోళనలను నివృత్తి చేయకుండానే ఆంధ్ర సర్కారు దీని నిర్మాణం చేపట్టడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మాట్లాడిన మంత్రి ఉమ, 2019కల్లా ప్రాజెక్టును పూర్తి చేయడమే తమ ధ్యేయమని విస్పష్టంగా తెలిపారు. అయితే, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ నేతలు పొరుగు రాష్ట్రాలను కయ్యానికి కాలు దువ్వేలా రెచ్చగొడుతున్నాయని అన్నారు. అయితే, వీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేవీ నెరవేరవని ఉమా స్పష్టం చేశారు. గోదావరి నదిపై నిర్మితమవుతున్న పోలవరం ప్రాజెక్టు రిజర్వాయర్ పరిధి ఇటు ఒడిశా, అటు చత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాలకు విస్తరిస్తుందన్న విషయం గమనార్హం.

చిత్రం.. ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు