రాష్ట్రీయం

‘నండూరి’ వైపే మొగ్గు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), అక్టోబర్ 20: రాష్డ్ర డిజిపిగా నండూరి సాంబశివరావును కొనసాగించడానికే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇన్‌ఛార్జి డిజిపిగా వ్యవహరిస్తున్న సాంబశివరావునే పూర్తిస్థాయి హోదాలో మరో రెండేళ్ల పాటు కొనసాగించే అంశాన్ని చురుగ్గా పరిశీలిస్తోంది. ఇందుకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ పూర్తయిందన్న ప్రచారం కూడా జరుగుతోంది. కేంద్రానికి పంపాల్సిన ప్రతిపాదనల ఫైలు ప్రస్తుతం సచివాలయం పరిశీలనలో ఉంది. ఆరుగురు అధికారులతో కూడి న జాబితా ఫైలు కేంద్రానికి అందిన తరువాత, కేంద్రం సూచించే ముగ్గురిలో ఎవరిని ఎంపిక చేయలనే విషయమై తిరిగి రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. నండూరి కొనసాగింపుకే ఛాన్స్ ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా స్పష్టమవుతోంది. ఇదే కనుక జరిగితే డిజిపి రేసులో ఉన్న సీనియర్ ఐపిఎస్ అధికారి, ఆర్టీసి ఎండి మాలకొండయ్య అవకాశాలకు తెర పడినట్లే. అయితే ఇన్‌ఛార్జి హోదా అయినప్పటికీ దాదాపు ఏడాది పూర్తి చేసుకున్న నండూరి రిటైర్డ్‌మెంట్ దగ్గర పడుతున్నందున మాలకొండయ్యకే ఛాన్స్ రావాలని ఆయన కోసం ఓ సామాజిక వర్గం ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం. 1984 బ్యాచ్‌కు చెందిన నండూరి సాంబశివరావు ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీతో పదవి విరమణ చేయనున్నారు. ఈయన ఆర్టీసి ఎండి గా పని చేస్తున్నప్పుడు డిజిపిగా ఉన్న జెవి రాముడు రిటైర్ కావటంతో ఇన్‌ఛార్జి డిజిగా నండూరిని నియమిస్తూ అప్పట్లో ఉత్తర్వులు వెలువడ్డాయి.
దీంతో ఈయన గత ఏడాది 2016 జూలై 23న బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటికీ ఇన్‌ఛార్జిగానే కొనసాగుతున్నారు. ఆమధ్య ఓసారి ఈయన్ను పూర్తిస్తాయి డిజిపిగా నియమించాలనే ప్రతిపాదనలు తెర మీదకు వచ్చాయి కూడా. అయితే ప్రభుత్వం వేచి చూసే ధోరణితో ఉన్నందున కార్యరూపం దాల్చలేదు. కాని మరో 70రోజుల్లో ఆయన రిటైర్ అవుతున్నందున డిజిపి ఎంపిక ప్రక్రియ తప్పనిసరైంది. ఈక్రమంలో నండూరి సాంబశివరావునే మరో రెండేళ్ళపాటు కొనసాగిస్తూ పూర్తిస్థాయి డిజిపి హోదాలో నియామక ఉత్తర్వులు జారీ చేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ప్రక్రియ కూడా రాష్ట్ర స్థాయిలో పూర్తయినట్లు సమాచారం. డిజి స్థాయి అధికారుల్లో రోడ్డు సేఫ్టీ అధారిటీ చైర్మన్ ఎస్‌వి రమణమూర్తి నండూరి కన్నా సీనియర్ అధికారి. అయితే ఈయన అనారోగ్యంతో బాధపడుతున్నందున.. తర్వాత ఛాన్స్ నండూరికే దక్కే అవకాశం ఉంది. ఈయన తర్వాత సీనియార్టీ జాబితాలో ఆర్టీసి ఎండి మాలకొండయ్య, ఏసిబి డిజి ఆర్‌పి ఠాకూర్, ఆ తర్వాత వరుసలో జైళ్ళశాఖ డిజి వినయ్ రంజన్ రే, దామోదర్ గౌతం సవాంగ్, విఎస్‌కె కౌముది ఉన్నారు. ఆర్టీసి ఎండి మాలకొండయ్య తర్వాత ఉన్నవారందరికీ చాలా సర్వీసు ఉంది. అందువల్ల మాలకొండయ్య డిజి రేసులో ముందున్నారు. ఈయన వచ్చే ఏడాది జూలైలో రిటైర్ కానున్నారు. అందువల్ల ఇప్పటికే ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్న నండూరి సాంబశివరావునే రెండేళ్ళపాటు పదవికాలం పొడిగిస్తూ పూర్తిస్థాయి హోదాలో నియామక ఉత్తర్వులు తీసుకురావాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. రేసులో ఉన్న సీనియర్ ఐపిఎస్‌ల జాబితా కేంద్రానికి వెళ్లి తిరిగి వచ్చాక నండూరి వైపే మొగ్గు చూపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందనే ప్రచారం ఉంది. వచ్చే ఎన్నికల నేపధ్యంలో సమర్థతతోపాటు సామాజికవర్గం, రాజకీయ కోణాల్లో కూడా ఈయనే కరెక్ట్ అనే అభిప్రాయం ఉన్నట్లు తెలుస్తోంది. కాని మాలకొండయ్యకు ఛాన్స్ ఇవ్వాలని మరోవైపు పార్టీలోనూ.. ప్రభుత్వంలోనూ ఓ వర్గం తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం నెలకొంది.

చిత్రాలు..సాంబశివరావు *మాలకొండయ్య