రాష్ట్రీయం

పెట్టుబడులకు అవకాశాలెన్నో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 20: అమెరికా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం న్యూయార్క్ చేరుకున్నారు. అయోవా నుంచి న్యూయార్క్ చేరుకున్న ఆయన బృందానికి ఘన స్వాగతం లభించింది. తెలుగువారు బాబు బృందానికి స్వాగతం పలికారు. తర్వాత బ్యాంక్ ఆఫ్ అమెరికా టవర్స్‌లో ఏర్పాటుచేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ఆయన ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చా రు. రాష్ట్రంలో ఉన్న అపార వనరులను సద్వినియో గం చేసుకోవాలని, తమది దేశంలోనే పెట్టుబడులకు అనుకూల అవకాశాలున్న రాష్టమ్రని వివరించారు. ప్రధానంగా ఐటి, వ్యవసాయ కంపెనీలకు అధిక ప్రోత్సాహం ఇస్తున్నామని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి, కంపెనీలు స్థాపించిన అమెరికా కంపెనీలు సంతోషంగా ఉన్నాయని చెప్పా రు. రాష్ట్రంలోనూ, దేశంలోనూ రాజకీయ సుస్థిరత ఉందని, రెండుచోట్లా సమర్థవంతమైన నాయకత్వాలు, దూరదృష్టి ఉన్న ప్రభుత్వాలున్నందున పెట్టుబడులకు మరింత సానుకూల వాతావరణం నెలకొందని బాబు వారికి వివరించారు.