రాష్ట్రీయం

గవర్నర్‌కు మాతృ వియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ మాతృమూర్తి విజయలక్ష్మి శ్రీనివాసన్ (94) కన్నుమూశారు. ఈ మేరకు శుక్రవారం నాడు రాజ్‌భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నిద్రలోనే తుది శ్వాస విడిచారని తెలిసింది. మరణ వార్త తెలిసిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రగతి భవన్ నుండి రాజ్‌భవన్‌కు వెళ్లి ఆమె పార్ధీవ దేహానికి నివాళులు అర్పించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు గవర్నర్‌ను ఫోన్‌లో పరామర్శించి విచారం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, అధికారులు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు సానుభూతి తెలిపారు. తెలంగాణ స్పీకర్ మధుసూధనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు కె టి ఆర్, తుమ్మల నాగేశ్వరరావు, జగదీష్‌రెడ్డి , పోచారం శ్రీనివాసరెడ్డి, వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేష్, కిమిడి కళావెంకటరావు, మాణిక్యాలరావులు రాజ్‌భవన్‌లో విజయలక్ష్మి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్, జి కిషన్‌రెడ్డి, ఎంపి బండారు దత్తాత్రేయ తదితరులు తమ సంతాపం తెలిపారు. తల్లి కళ్లను దానం చేయాలని నిర్ణయించుకున్న గవర్నర్ ఈ సమాచారాన్ని వైద్యులకు అందించడంతో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వైద్య నిపుణులు రాజ్‌భవన్‌కు చేరుకుని వాటిని సేకరించారు.
ముగిసిన అంత్యక్రియలు
సాయంత్రం పంజాగుట్ట స్మశానవాటికలో విజయలక్ష్మి అంతిమ సంస్కారం జరిగింది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుతో పాటు పలువురు మంత్రులు హాజరై గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను ఓదార్చారు.

చిత్రం..గవర్నర్ మాతృమూర్తి పార్ధివ దేహం వద్ద నివాళులు అర్పిస్తున్న సిఎం కెసిఆర్