ఆంధ్రప్రదేశ్‌

వంశధారకు పెరిగిన నీటిమట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిరమండలం, అక్టోబర్ 20: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా కురుస్తున్న వర్షాలకు వంశధార నదిలో నీటిమట్టం పెరుగుతోంది. వాయుగుండం ఒడిశా ప్రాంతానికి తరలడంతో కురిసిన వర్షాలకు శుక్రవారం వరదనీరు చేరుతుండడంతో గొట్టాబ్యారేజీ అధికారులు నది దిగువ భాగానికి నీటిని విడిచిపెడుతున్నారు. బ్యారేజ్ వద్ద 22 గేట్లను 20 సెంటీమీటర్లు ఎత్తి నది దిగువ భాగానికి నీటిని విడుదల చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి 16 వేల క్యూసెక్కుల నీటిని దిగువ భాగానికి విడిచిపెడుతున్నారు. బ్యారేజీ క్యాచ్‌మెంట్ ఏరియా గుడారి, గుణుపూర్, కాశీనగర్, మోహన, మహేంద్రగడ, గొట్ట ప్రాంతంలో 326 మిమీ వర్షపాతం నమోదైనట్టు తెలిపారు. ఎడమ కాలువకు 812, కుడి కాలుకు 67 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్టు తెలిపారు. అర్థరాత్రి దాటాక నదిలో 40 వేల క్యూసెక్కుల నీరు ప్రవహించే అవకాశముందని అధికారులు తెలిపారు.

చిత్రం..గొట్టా బ్యారేజీ నుంచి దిగువకు విడిచి పెడుతున్న నీరు