రాష్ట్రీయం

శరవేగంగా విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 21: రాజమహేంద్రవరంలోని మధురపూడి విమానాశ్రయం శరవేగంగా విస్తరణ పనులు జరుగుతున్నాయి. రన్‌వేను విస్తరిస్తున్నారు. ఒకే సారి ఐదు భారీ విమానాలకు సరిపడే విధంగా ఏఫ్రాన్ నిర్మిస్తున్నారు. అదే విధంగా రాష్ట్రంలోనే ప్రత్యేక కార్గోకు భారీ ఏర్పాట్లు చేపట్టారు. కాంట్రాక్టు గడువు కంటే ముందే పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
డిసెంబర్ చివరి నాటికల్లా రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి ఇండిగో విమానయాన సంస్థ తన సర్వీసులను నడిపేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. మొత్తం 4 సర్వీసులను ప్రవేశపెడుతున్నారు. 4 విమానాలు రాను, 4 విమానాలు పోను సర్వీసులను తిప్పనున్నారు. చలికాలం నుంచి ఈ విమానాల రద్దీ పెరగనుంది. సంక్రాంతి సందడి నుంచి ప్రకృతి అందాల అలరారే ఈ ప్రాంతానికి పర్యాటక సొబగుల మధ్య విమానయాన తాకిడి పెరగనుంది. మొదటి దశలో హైదరాబాద్‌కు రెండు, చెన్నై, బెంగుళూరుకు ఒక్కొక్క సర్వీసు చొప్పున విమానాలు నడిపేందుకు ఇండిగో సంస్థ ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి జెట్ ఎయిర్‌వేస్ రెండు సర్వీసులు, స్పైస్‌జెట్, ట్రూజెట్ సంస్థలు ఒక్కొక్క విమానాన్ని హైదరాబాద్‌కు, చెన్నైకు నడుపుతున్నాయి. ప్రస్తుతం రోజుకు సుమారు వెయ్యి మంది వరకు ప్రయాణీకులు చొప్పున నెలకు 30 వేల మంది వరకు ప్రయాణిస్తున్నారు. ఇండిగో సంస్థ తమ సర్వీసులు మొదలు పెడితే డిసెంబర్ నుంచి రోజుకు రెండు వేల మంది ప్రయాణికులు తమ ప్రయాణాలు సాగించేందుకు అవకాశం వుంది. ఈ మేరకు డిసెంబర్ లేదా, జనవరి సంక్రాంతి పండుగ నాటికి రాజమహేంద్రవరం విమానాశ్రయం రోజుకు పది విమానాలు రాను, పోను తిరిగే విధంగా రద్దీగా మారనుంది. ఇందుకు అవసరమైన రీతిలో వౌలిక సదుపాయాలు, పార్కింగ్ స్థలాలతో విమానాశ్రయం సమగ్ర అభివృద్ధితో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి అందాలు పొదుగుకుంది. ఇప్పటి వరకు బోర్డింగ్ పాస్‌లు అన్ని రకాల తనిఖీలు జరిగిన తర్వాత తీసుకునే విధంగా వుండేది. కానీ ఇపుడు టికెట్‌ను కియోష్క్‌లో పెట్టిన వెంటనే ఎయిర్‌పోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించిన వెంటనే బోర్డింగ్ పాస్‌లు తీసుకునే విధంగా రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేయడం ప్రత్యేకత సంతరించుకుంది. అదే వి ధంగా ప్రయాణీకుల సౌకర్యార్ధం ఎయిర్‌పోర్టు ప్రాంగణంలోనే ఎస్‌బిఐ ఎటిఎంలు ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా వుండగా ప్రస్తుతం ఎయిర్‌పోర్టు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సువిశాలమైన ఎయిర్‌పోర్టుగా ప్రత్యేక ప్రమాణాలతో రూపుదిద్దుకుంటోంది. 2018 మార్చి నాటికి రన్‌వే, ఏఫ్రాన్స్‌ను పూర్తి చేసేందుకు లక్ష్యంగా నిర్ధేశించారు. ఈలోపే పూర్తయ్యేందుకు అవకాశం వుందని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ రాజ్‌కిషోర్ చెప్పారు. ఒకే సారి ఐదు విమానాలు నిలుపుదల చేసే విధంగా ఏఫ్రాన్స్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం రాను, పోను మూడు విమనాలకు సరిపడే విధంగానే ఏఫ్రాన్ వుంది. ఇపుడు విస్తరణలో ఐదు విమానాలు రాను, పోను సరిపడే విధంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ ఏఫ్రాన్ కూడా భారీ విమానాలకు సరిపడే విధంగా తీర్చిదిద్దుతున్నారు. మార్చి నుంచి భారీ విమానాలు రానున్నాయి. దీంతో రాజమహేంద్రవరం నుంచి దేశ, విదేశాలకు వెళ్ళే భారీ విమానాలు తిరగనున్నాయి. అందుకు అవసరమైన రీతిలో వౌలిక సదుపాయాలతో విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అదే విధంగా హెలీకాప్టర్లు కూడా అధిక సంఖ్యలో నిలుపుదల చేసే విధంగా స్థానిక చమురు, సహజవాయు సంస్థల కార్యకలాపాల రద్ధీకి తగిన విధంగా ప్రత్యేకంగా హెలీకాప్టర్ పార్కింగ్ స్థలాలను అభివృద్ధి చేస్తున్నారు. ఆఫ్‌షోర్, ఆన్‌షోర్ కార్యకలాపాలు, పారిశ్రామిక సంస్థల అవసరాలకు, సంబంధిత సంస్థల ప్రతినిధులకు నిత్యం వీలుగా ఉండే విధంగా హెలీకాప్టర్ ప్రాంగణాన్ని ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. విమానాల ప్రాంగణం, హెలీకాప్టర్ ప్రాంగణాలు విడివిడిగా ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. పలు హెలీకాప్టర్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. 2014-15లో 5634 మంది దిగేవారు, ఎక్కే ప్రయాణికుల మేరకు 1.56 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తే..2015-16లో అది కాస్తా 2.24 లక్షల మంది ప్రయాణికుల స్థాయికి పెరిగింది. 2016-17లో 2.70 లక్షలకు పెరిగింది.