రాష్ట్రీయం

రేషన్ బదులు నగదు పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: రేషన్ (సబ్సిడీ బియ్యం) బదులుగా తాత్కాలికంగా నగదును పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రేషన్ డీలర్లు రాష్టవ్య్రాప్తంగా సమ్మెకు దిగుతున్నట్టు ప్రభుత్వానికి నోటీసు ఇవ్వడంతో శనివారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయంచారు. సిఎం నేతృత్వంలో జరిగిన సమావేశంలో డీలర్ల సమ్మెకు కారణాలు, పరిష్కార మార్గాలపై చర్చించారు. ఒకవేళ డీలర్లు సమ్మె ఉపసంహరించకుంటే రూపాయికే కిలో సబ్సిడీ బియ్యం పంపిణీకి ప్రత్యామ్నాయంగా తెల్లరంగు రేషన్ కార్డు ఉన్నవారికి తాత్కాలికంగా నగదు ఇవ్వాలని ఆలోచనకు వచ్చారు. ఏటా రేషన్ కోసం 6,500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని కెసిఆర్ గుర్తు చేశారు. అఖిలభారత సర్వీస్ అధికారులతోపాటు అనేక మంది సిబ్బంది రేషన్ సరకుల పంపిణీలో భాగస్వామ్యులు అవుతున్నారన్నారు. పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు కావడంతో పాటు సిబ్బంది విలువైన సమయం వెచ్చించాల్సి వస్తోందన్నారు. అయినప్పటికీ
ఆశించిన ఫలితాలు రావడం లేదని, లబ్దిదారులకు చేరాల్సిన బియ్యం బ్లాక్‌మార్కెట్లోకి పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యం అక్రమ రవాణా మాఫియానే ఏర్పడిందన్నారు. ఉన్నతాధికారులను కూడా మేనేజ్ చేసే స్థాయికి అక్రమ దందా నిర్వహించేవారు చేరుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజూ పత్రికల్లో బియ్యం అక్రమ రవాణా గురించిన వార్తలు వసూనే ఉన్నాయన్నారు. భారీ ఎత్తున నిధులు ఖర్చవుతున్నప్పటికీ, ప్రభుత్వానికి చెడుపేరు వస్తోందని మనోవేదన కలుగుతోందన్నారు. ఈ పరిస్థితి పోవాలని, ప్రభుత్వం వ్యయం చేస్తున్న నిధులు పక్కాగా పేదలకు చేరాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ప్రత్యామ్నాయ విధానాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
నేరుగా లబ్ది
రేషన్ పంపిణీకి ప్రత్యామ్నాయంగా పేదలకు నేరుగా లబ్ది చేకూరే విధానం (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) చేపట్టవచ్చని ఉన్నతాధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి సూచించారు. చండీగఢ్, పాండిచ్చెరి, దాద్రాహవేలి తదితర కేంద్రపాలిత ప్రాంతాల్లో రేషన్ బదులుగా లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేస్తున్నారని గుర్తు చేశారు. నగదు బదిలీ విధానానే్న అన్ని రాష్ట్రాలు కూడా అమలు చేయాలంటూ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపు ఇచ్చారని గుర్తు చేశారు. యుపిఎ ప్రభుత్వం 2013 లో తీసుకువచ్చిన ఆహార భద్రతా చట్టంలో సబ్సిడీ ద్వారా అందించే లబ్దిని నగదు రూపంలో నగదుగా లబ్దిదారులకు చెల్లించాలన్న సూచన ఉందన్నారు. సరకుకు బదులుగా నగదునే లబ్దిదారులకు చెల్లించడంవల్ల ఒనగూడే ప్రయోజనాలను వివరించారు. దీని వల్ల లబ్దిదారులు తమ ఆహార అలవాట్లకు అనుగుణంగా బియ్యం లేదా జొన్నలు, గోధుమ, తైదలు తదితర ఆహార పదార్థాలను కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. ఆహార పదార్థాలను ఎప్పుడు, ఎలా, ఎంత మేరకు కొనాలన్న నిర్ణయం లబ్దిదారుడికి లభిస్తుందని అధికారులు వివరించారు. అందువల్ల బియ్యం తదితర నిత్యావసర సరకుల బదులుగా లబ్దిదారులు ఖాతాల్లోకి నగదును నేరుగా బదిలీ చేసే యోచన చేయాలంటూ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు అధికారులు సూచించారు. ఈ అంశంపై కూలంకషంగా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఈ సమావేశంలో మంత్రులు లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీశ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..పౌరసరఫరాల శాఖ సమీక్షలో మాట్లాడుతున్న సిఎం కెసిఆర్