రాష్ట్రీయం

వైద్య సేవలు అమోఘం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: కెసిఆర్ కిట్స్ పథకం ప్రారంభమైన తర్వాత దవాఖానాల్లో పనిభారం పెరగడంతో డాక్టర్లను ప్రోత్సహించేందుకు ‘నగదు ప్రోత్సాహకాలు’ ఇవ్వాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నిర్ణయించారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యక్రమాలపై శనివారం ఆయన ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. కెసిఆర్ కిట్స్ పథకం ప్రారంభమైన తర్వాత సర్కారు దవాఖానాలకు వస్తున్న రోగుల సంఖ్య బాగా పెరిగిందని, ప్రజల్లో సర్కారు దవాఖానాలపై నమ్మకం ఏర్పడ్డదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెల్లడించారు. సర్కారు డాక్టర్లపై ప్రజల్లో గౌరవం పెరిగిందన్నారు. ప్రజల నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, సిబ్బంది మరింత జాగ్రత్తగా పనిచేయాలని సూచించారు. కెసిఆర్ కిట్స్ పథకం తర్వాత పనిభారం పెరిగినప్పటికీ, ఓపికతో, శ్రద్దతో పనిచేస్తున్న వైద్యులకు నగదు బహుమతులు ఇవ్వాలని నిర్ణయించి, ఇందుకు సంబంధించిన పైలుపై ముఖ్యమంత్రి అప్పటికప్పుడే సంతకం చేశారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి మొదలుకుని, బోధనాసుపత్రుల వరకు దవాఖానాలుకు వస్తున్న రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సర్కారు దవాఖానాల్లోపనిచేస్తున్న సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నామని పేర్కొన్నారు. గతంలో ప్రైవేట్ దవాఖానాలకు కాన్పుకోసం వెళ్లే వారికి ప్రైవేట్ దవాఖానాల వారు ఆపరేషన్ చేసే వారని, దాంతో తల్లీబిడ్డల ఆరోగ్యం దెబ్బతినేదన్నారు. ఇప్పుడు గ్రామాలు, పట్టణాల్లో కూడా గర్భిణీలు ప్రైవేట్ దవాఖానాలకు పోవడం బంద్ చేసి, సర్కారు దవాఖానాలకే వస్తున్నారన్నారు. దాంతో వారు ప్రైవేట్ దవాఖానాలకు చెల్లించే డబ్బు మిగులుతోందని, సర్కారు దవాఖానాలకు రావడం వల్ల ప్రభుత్వం ఇచ్చేప్రోత్సాహకాలు, 12 వేల రూపాయలు లభిస్తున్నాయన్నారు.వార్షకాలంలో ఆదిలాబాద్‌లాంటి ఏజన్సీ ప్రాంతాల్లో గతంలో విషజ్వరాల వల్ల అనేక మంది మరణించేవారని, ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న చర్యలతో విషజ్వరాలే తగ్గాయన్నారు. వైద్యుల పనితీరుకు ఇది నిదర్శనంగా నిలుస్తోందని సిఎం కితాబిచ్చారు.
ముఖ్యమైన అంశాలపై నిర్ణయాలు:
* బోధనాసుపత్రుల్లో టీచర్ల పదవీ విరమణ వయోఃపరిమితిని 65 ఏళ్లకు పెంచే అంశం పరిశీలించాలని నిర్ణయించారు.
* సెమీ అటానమస్ మెడికల్ కాలేజీల్లో కూడా బోధనా సిబ్బంది పదవీవిరమణ వయస్సును 58 ఏళ్ల నుండి 65 ఏళ్లకు పెంచేందుకు సానుకూలంగా స్పందించారు.
* మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీల్లో వసతులు కల్పించాలని నిర్ణయించారు.
* అర్హులైన డాక్టర్లకు వెంటవెంటనే పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించారు.
* ఏజన్సీ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లోని దవాఖానాల్లో పనిచేసే డాక్టర్లు స్థానికంగా ఉండాలన్న నిబంధనను సడలించి సమీప పట్టణాల్లో ఉండేందుకు అనుమతించాలని నిర్ణయించారు.
* పాత దవాఖానా భవనాల స్థానంలో కొత్త భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు.
* ఆసుపత్రి భవనాలతో పాటు డాక్టర్లు, సిబ్బంది నివసించేందుకు క్వార్టర్లు నిర్మించాలని నిర్ణయించారు.
* పెద్దాసుపత్రుల్లో రోగుల బంధువుల కోసం షెల్టర్లు నిర్మించాలని నిర్ణయించారు.
* హైదరాబాద్ నగరంలో బీబీనగర్‌లోని నిమ్స్‌తో పాటు ఔటర్ రింగ్‌రోడ్డులోని ఇతర ప్రధాన నగరాలతో అనుసంధానం చేసే చోట రెండు పెద్ద ఆసుపత్రులను నిర్మించాలని నిర్ణయించారు.
* ప్రభుత్వ దవాఖానాల భవనాలు, స్థలాలు, ఇతర ఆస్తులకు సంబంధించిన వివరాలు సమగ్రంగా రూపొందించాలని ఆదేశించారు.
* కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలను అధ్యయనం చేసి వానిటి పూర్తిగా వినియోగించుకోవాలని నిర్ణయించారు.
* వైద్య ఆరోగ్య శాఖకు అవసరమైన నిధులను జాప్యం లేకుండా విడుదల చేయాలని ఆర్థిక శాఖను ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు.

చిత్రం.. ముఖ్యమంత్రి కెసిఆర్