రాష్ట్రీయం

బంగారు తెలంగాణ సాధనలో పోలీసులే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణతోపాటు బంగారు తెలంగాణ సాధనలో పోలీసులే కీలకమని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. విధినిర్వహణలో ఈ యేడాది 383 మంది పోలీసులు అమరులయ్యారని మంత్రి తెలిపారు. నేరస్థులు తప్పించుకోలేరనే దిశగా పోలీసులు పనిచేయాలని సూచించారు. పోలీస్ అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా డిజిపి అనురాగ్‌శర్మతో కలసి గోషామహల్ స్టేడియంలో పోలీస్ అమరుల స్థూపం వద్ద అమర పోలీసుకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే పెట్టుబడులు వస్తాయని, తద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని, ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రజలు కోరుకున్న బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. ఇప్పటికే తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ వన్‌గా నిలుస్తూ, అంతర్జాతీయ స్థాయిలో తమ ఉనికికి చాటుకుంటున్నారన్నారు. పోలీసులకు ప్రజలు మిత్రులుగా వ్యవహరిస్తున్నారని, నేరాల సంఖ్య తగ్గిందన్నారు. హైదరాబాద్ నగరంలో లక్ష సీసీటీవీ కెమెరాల ఏర్పాటు లక్ష్యంగా పోలీస్ శాఖ ముందుకెళ్తుందన్నారు. తెలంగాణకు నాలుగువేల పరిశ్రమలు రావడంలో పోలీసులు కీలక పాత్రం పోషించారన్నారు. పోలీస్‌శాఖ అభివృద్ధికి 7వ, బడ్జెట్‌లో రూ. వెయ్యి కోట్లు కేటాయించామని, బంగారు తెలంగాణ సాధనలో పోలీసులదే ప్రధాన భూమికని, రానున్న ఐదేళ్లలో పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని హోమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. తెలంగాణలో పోలీస్ శాఖలో కొత్తగా 18290 పోస్టులు మంజూరు కాగా, 10981 పోస్టుల నియామకం జరిగిందని, మిగతా ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కొత్తగా రూపొందించిన పోలీస్ అమరుల స్మరణలో తపాల బిళ్లను విడుదల చేశారు. గోషామహల్ స్టేడియం ఆవరణలో ఏర్పాటుచేసిన పోలీస్ ఎక్స్‌పోకు మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ ఉన్నతాధికారులతోపాటు పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

చిత్రం..పోలీసు అమర వీరులకు నివాళులర్పిస్తున్న హోంమత్రి నాయిని, డిజిపి అనురాగ్‌శర్మ తదితరులు