ఆంధ్రప్రదేశ్‌

తిరుమలకు అనూహ్యంగా పెరిగిన రద్దీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 21: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తుల రద్దీ శనివారం అనూహ్యంగా పెరిగింది. బుధవారం నాటికి పెరటాసి మాసం ముగిసినప్పటికీ ఐదో శనివారం రావటంతో భక్తులు తిరుమలకు పోటెత్తారు. రెండు వైకుంఠ క్యూ కాంప్లక్స్‌లో 51 కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయి భక్తులు స్వామి దర్శనం కోసం కిలోమీటర్ల మేర బారులు తీరారు. దీంతో ఉచిత క్యూలైన్‌లో వెళ్లే భక్తులకు 16 గంటల సమయం పడుతోంది. రాత్రి 8 గంటల వరకు 72 వేల మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్నారు. మరో 40 వేల మంది స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్‌లో వేచి ఉన్నారు. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు హుండీలో సమర్పించిన కానుకల ద్వారా రూ. 3.5 కోట్లు టిటిడికి ఆదాయం లభించింది. పెరిగిన భక్తుల రద్దీ కారణంగా వసతి కొరత ఏర్పడటంతో గదులు దొరకని భక్తులు ఉద్యానవనంను ఆశ్రయించారు. టిటిడి ఇన్‌చార్జి ఇఓ కె శ్రీనివాసరాజు, తిరుమలలో కలయ తిరుగుతూ భక్తుల సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉందని టిటిడి వర్గాలు తెలిపాయి.

చిత్రం..తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ