రాష్ట్రీయం

కెటిపిఎస్ పాత యూనిట్లు మూసివేత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాల్వంచ, అక్టోబర్ 22: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కెటిపిఎస్ పాత ప్లాంట్ కర్మాగారంలో 8 యూనిట్లను త్వరలో మూసివేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు 30 సంవత్సరాలు నిండిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మూసివేసేందుకు అనుమతివ్వాలని టిఎస్ జెన్కో ఇటీవల ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రకారం కెటిపిఎస్ పాత ప్లాంట్‌లో 720 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 8 యూనిట్లు 30 ఏళ్లు నిండిన జాబితాలో చేరాయి. 2019 డిసెంబర్‌లోగా ఈ కేంద్రాలను మూసివేయాలని కేంద్ర ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో పాత ప్లాంట్‌లోని యూనిట్లన్నీ కనుమరుగు కానున్నాయి. పాత ప్లాంట్ మూసివేసిన తరువాత వీటి స్థానంలో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ ప్రాజెక్ట్ నిర్మించాలని జెన్కో యాజమాన్యం తలపెట్టింది. దీనికి ఇప్పటికే ముఖ్యమంత్రి కెసిఆర్ నుండి అనుమతి కూడా లభించింది. ప్రస్తుతం పాల్వంచలో రూ. 500 కోట్ల వ్యయంతో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 7వ దశ కర్మాగారం నిర్మాణం చేపట్టారు. పాత ప్లాంట్‌లోని యూనిట్లన్నీ వాస్తవానికి 40 ఏళ్ల చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. అయినప్పటికీ ఈ యూనిట్లు అత్యధికంగా విద్యుత్ ఉత్పత్తి సాధిస్తుండటంతో రాష్ట్రంలోనే కెటిపిఎస్ ప్రథమ స్థానంలో నిలుస్తోంది. 1966 జూలై 4న 60 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో 1వ యూనిట్ విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించగా, 1967 జులై 8 నాటికి మరో 3 యూనిట్ల ద్వారా 60 మెగావాట్ల చొప్పున ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. ఆ తర్వాత 130 మెగావాట్ల విద్యుతుత్పత్తి సామర్థ్యంతో 5, 6 యూనిట్లు ఏర్పాటు చేయగా, 1974 ఆగస్టు 19న 5వ యూనిట్‌ను, ఇదే సంవత్సరం డిసెంబర్ 19న 6వ యూనిట్‌ను ప్రారంభించారు. అనంతరం 120 మెగావాట్ల సామర్థ్యంతో 7, 8 యూనిట్లను నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. జపాన్ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన యూనిట్ల నుంచి కాలుష్యం అధికంగా వస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం సూపర్ టెక్నాలజీ విధానాన్ని అమలులోకి తెచ్చింది. 600 మెగావాట్ల పైచిలుకు విద్యుత్‌ను ఉత్పత్తి చేసే యూనిట్లను మాత్రమే నెలకొల్పాలనే లక్ష్యాన్ని ఎలక్ట్రిసిటీ అథారిటీ నిర్దేశించుకుంది. దీంతో కెటిపిఎస్ ఒ అండ్ ఎంలోని 8 యూనిట్లను తొలగించాలని ఆ సంస్థ ఆదేశించింది. ఈనేపథ్యంలో 60 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేసే 3వ యూనిట్‌లో సాంకేతిక సమస్య ఎదురుకావడంతో ఆ యూనిట్‌ను ఇటీవల శాశ్వతంగా మూసివేశారు. తర్వాత 7 యూనిట్ల ద్వారా 700 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. పాల్వంచలో అన్ని వనరులున్న నేపథ్యంలో ప్రభుత్వం కెటిపిఎస్‌లో యూనిట్లను విస్తరించాలని నిర్ణయించింది. ఈమేరకు 250 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో కెటిపిఎస్ 5వ దశను ఏర్పాటు చేసింది. రూ. 5వేల కోట్ల వ్యయంతో 5వ దశలోని 9, 10 యూనిట్ల నిర్మాణాన్ని 1997, 98 సంవత్సరాల్లో పూర్తిచేసింది. 9వ యూనిట్‌ను 1997 అక్టోబర్ 1న, 10వ యూనిట్‌ను 1998 సెప్టెంబర్ 1న ప్రారంభించింది. తర్వాత రూ. 5వేల కోట్ల వ్యయంతో 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 6వ దశను ఏర్పాటు చేసింది. ఇదిలావుంటే, నూతనంగా చేపట్టిన 7వ దశ కర్మాగారం నిర్మాణాన్ని డిసెంబర్ నాటికి పూర్తిచేసేందుకు అధికారులు, ఇంజనీర్లు శ్రమిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి ఈ యూనిట్ నుంచి విద్యుదుత్పత్తి ప్రారంభించే లక్ష్యంతో పనులను శరవేగంగా కొనసాగిస్తున్నారు.
చిత్రం..పాల్వంచలోని కెటిపిఎస్ కర్మాగారం