రాష్ట్రీయం

సకాలంలో ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 22: ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, రాష్ట్రంలో సకాలంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. ఐదువందల జనాభా ఉన్న ప్రతి గిరిజన తండా, చెంచుగూడెం, ఆదివాసీ ప్రాంతాలు, శివారు గ్రామాలను పంచాయతీలుగా మారుస్తామని పునరుద్ఘాటించారు. కేబినెట్ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంటామని, అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం చేస్తామని హామీ ఇచ్చారు. పంచాయతీరాజ్ వ్యవస్థకు విప్లవాత్మక మార్పులతో సరికొత్త రూపాన్ని తీసుకువస్తామని, గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని ప్రజల ముందుకు తీసుకువస్తామన్నారు. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట వద్ద కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు నిర్మాణానికి సిఎం కెసిఆర్ ఆదివారం శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం 8684 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, ప్రతి ఐదు వందల జనాభాకు ఒక గ్రామపంచాయతీ ఏర్పాటు చేయడం ద్వారా మరో నాలుగైదువేల గ్రామ పంచాయతీలు ఏర్పడతాయన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేసే చర్యల్లో భాగంగా గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా మారుస్తామని, రోడ్లు, డ్రైనేజీ తదితర వౌలిక సౌకర్యాలు కల్పిస్తామని, దీనికోసం రెండు నుంచి మూడువేల కోట్లు కేటాయిస్తామన్నారు. గ్రామాల జనాభా ఆధారంగా నిధుల కేటాయింపులు జరుపుతామని, చిన్న గ్రామానికి కనీసం 10 లక్షలు లభించేలా, ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలకు అధిక నిధులు లభించేలా చూస్తామని, దీనికి సంబంధించిన కార్యాచరణ వచ్చే బడ్జెట్‌లో పెడతామన్నారు.