రాష్ట్రీయం

మాజీ మంత్రిపై కుట్ర కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ చిక్కడపల్లి, అక్టోబర్ 22: మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దుద్దిళ్ల శ్రీ్ధర్‌బాబుపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తనను ఓ మాజీ సర్పంచ్‌తో కలసి గంజాయి కేసులో ఇరికించేందుకు కుట్ర పన్నారంటూ కరీంనగర్ జిల్లా ముత్తారం తెరాస నేత కిషన్‌రెడ్డి ఫిర్యాదు మేరకు శ్రీ్ధర్‌బాబు, మాజీ సర్పంచ్ సుదర్శన్‌పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణల ఆడియో టేపును తెరాస నేత కిషన్‌రెడ్డి పోలీసులకు అందించారు. కరీంనగర్ జిల్లా ఓదేడులో 9 ఎకరాల భూమికి సంబంధించి మాజీ మంత్రి శ్రీ్ధర్‌బాబు, మాజీ సర్పంచ్ సుదర్శన్‌లతో తెరాస నేత కిషన్‌రెడ్డికి గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. దీంతో కిషన్‌రెడ్డిపై గంజాయి అక్రమ రవాణా కింద కేసు పెట్టించాలని వారిద్దరు కుట్రపన్నారని, ఇందుకోసం భార్గవ్ అనే వ్యక్తి ద్వారా గంజాయి తెప్పించి తన కొట్టాంలో ఉంచి పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావించారని కిషన్‌రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈక్రమంలో వారిద్దరు మాట్లాడుకున్న సందర్భంలో రికార్డయిన సంభాషణలను కిషన్‌రెడ్డి సేకరించి పోలీసులకు ఆధారాలు సమర్పించాడు. ఆధారాలు పరిశీలించిన పోలీసులు ఆ సమయంలో మాజీ మంత్రి, మాజీ సర్పంచ్ ఎక్కడి నుంచి సెల్‌ఫోన్‌లో మాట్లాడుకున్నారో పరిశీలించారు. మాజీ మంత్రి శ్రీ్ధర్‌బాబు దోమలగూడ నుంచి ఫోన్ మాట్లాడినట్టు తేలడంతో ఆయనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం వ్యవహారం భూవివాదం నేపథ్యంలో సాగిందని సెంట్రల్ జోన్ డిసిపి జోయల్ డేవిస్ తెలిపారు. అయితే వీరి మధ్య సాగిన సంభాషణలో ఆడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని, వాయిస్ నివేదిక వచ్చిన తరువాతే అరెస్టు చేస్తామని డిసిపి పేర్కొన్నారు. ఇప్పటికే పోలీసులు మాజీ సర్పంచ్ సుదర్శన్‌ను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మాజీ మంత్రి శ్రీ్ధర్‌బాబు సహ మాజీ సర్పంచ్ సుదర్శన్, భార్గవ్ అనే వ్యక్తిపై పోలీసులు ఐపిసి 29 రెడ్ విత్, 20బి క్లాజ్ 2 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో ఎ1గా సుదర్శన్, ఎ2గా శ్రీ్ధర్ బాబు, ఎ3గా భార్గవ్ ఉన్నారు. ఇదిలావుండగా టాస్క్ఫోర్స్ పోలీసులు సుదర్శన్, భార్గవ్‌లను అదుపులోకి తీసుకున్న తరువాతే వారిచ్చిన సమాచారం మేరకు టిఆర్‌ఎస్ నేత కిషన్ రెడ్డి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి ఆడియో టేపులను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించామని, ఈ వాయిస్ శ్రీ్ధర్‌బాబుదా? కాదా? అనే అంశంపై పరిశీలన జరుగుతోందని డిసిపి జోయల్ డేవిస్ వివరించారు.