రాష్ట్రీయం

పిజి జవాబుపత్రాలు మరోసారి దిద్దండి: హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 23: పిజి మెడికల్ విద్యార్థుల జవాబు పత్రాలను మరోమారు దిద్దాలని హైకోర్టు సోమవారం నాడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీని ఆదేశించింది. 2017 మేలో జరిగిన ఈ పరీక్షలపై 50 మంది విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. డాక్టర్ సి సాయి సువీర్ రెడ్డి తదితరులు దాఖలు చేసిన వేర్వేరు పిటీషన్లను విచారించిన జస్టిస్ ఎ రామలింగేశ్వరరావు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. రీ వాల్యూయేషన్ ప్రక్రియ పూర్తికాకుండానే సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించవద్దని ఆదేశించారు.
రిఫండ్ కోసం పిటిషన్ వేయండి
సదావర్తి భూముల కొనుగోలుకు సంబంధించి తాను చెల్లించిన 27.44 కోట్ల రూపాయిలను వెనక్కు ఇవ్వాలన్న వైకాపా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పిటిషన్‌పై హైకోర్టు అనుమతించింది. రిఫండ్‌కు సంబంధించి మరో పిటీషన్‌ను దాఖలు చేయాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్, జస్టిస్ ఎం గంగారావులతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
రికార్డుల్లేవు..ఐవైఆర్
ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే అధికారులు తామిచ్చిన సలహాలు, సూచనలకు సంబంధించిన రికార్డులను ఎప్పటికపుడు ధ్వంసం చేస్తున్నారని, వాటిని పరిరక్షించడం లేదని దాంతో పరిపాలనలో జవాబుదారీతనం, పారదర్శకత ఉండటం లేదని ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధానకార్యాదర్శి ఐ వై ఆర్ కృష్ణారావు హైకోర్టులో పిల్ దాఖలుచేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బిజినెస్ రూల్స్ అండ్ సెక్రటేరియట్ ఇనస్ట్రక్షన్స్ ఇటు మంత్రులకూ ,అటు కార్యదర్శులకు, అధికారులకు సైతం వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ విషయంలో న్యాయస్థానం తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు.