రాష్ట్రీయం

అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించే యోచన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 23: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించే అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తర్జన-్భర్జన పడుతున్నది. ఈ నెల 26న జరిగే వైకాపా శాసనసభాపక్షం సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నది. వచ్చే నెల 2వ తేదీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టనున్న సంగతి తెలిసిందే. అయితే తన పాదయాత్ర సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కావాలనే అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించాలని నిర్ణయించిందని జగన్ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలా? వద్దా? అనే అంశంపై జగన్ సోమవారం పార్టీ ముఖ్య నేతలతో, అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలతో సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోతే ప్రజా సమస్యలపై వైకాపాకు చిత్తశుద్ధి లేదన్న అభిప్రాయాన్ని టిడిపి నేతలు, రాష్ట్ర ప్రభుత్వం కల్పించే ప్రయత్నం చేస్తుందన్న అభిప్రాయాన్ని కొంత మంది వ్యక్తం చేయగా, అటువంటిదేమీ ఉండదని, ప్రభుత్వం చేస్తున్న ఆగడాల గురించి ప్రజలకు ఇప్పటికే అర్థమైంది కాబట్టి వారు అర్థం చేసుకుంటారని మరి కొందరు అభిప్రాయపడ్డారు. పైగా అసెంబ్లీ సమావేశాలకు హాజరైనా, వివిధ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసినా, సరైన సమాధానం చెప్పకుండా దాట వేయడమో, లేక ఎదురు దాడి చేస్తూ, సభాకాలాన్ని వృధా చేయడం మినహా మరేమి ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. ఇలా చాలా సేపు చర్చ జరిగింది. తమ పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో అధికారపక్షం బెంచీల్లో సీట్లు కేటాయించి కూర్చోబెట్టుకుంటే, దేశ చరిత్రలో ఇంతగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే, అటువంటి అసెంబ్లీకి మనం చూసీ చూడనట్లు, ఏమీ జరగనట్లు వెళ్ళడం సమంజసం కాదన్న అభిప్రాయాన్ని పలువురు సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రారంభానికి ముందే 20 మంది ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేసి, నలుగురు మంత్రులను బర్తరఫ్ చేసి, శాసనసభ సంప్రదాయాల ప్రకారం ప్రతిపక్షానికి ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇచ్చేలా ఉంటేనే అసెంబ్లీకి హాజరు కావాలని మరి కొందరు అభిప్రాయపడ్డారు. జగన్ మాత్రం ఈ అంశంపై తన అభిప్రాయాన్ని వెల్లడించలేదు.