రాష్ట్రీయం

ఓ కాపు కాయండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 29: సామరస్య సమాజంలో సంఘర్షణ వాతావరణం సృష్టించాలని కొన్ని శక్తులు బలవంతపు ప్రయత్నం చేస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పార్టీలు వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. వైషమ్యాలు రెచ్చగొట్టడం ద్వారా కులాల మధ్య వైరం పెంచడానికి ఆ శక్తులు చూస్తున్నాయని విమర్శించారు. కాపుల సంక్షేమం, రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే, దాన్ని చెడగొట్టేలా రెచ్చగొట్టే ధోరణితో వైకాపా, కాంగ్రెస్ పార్టీలు వ్యవహరిస్తున్నాయని తప్పుపట్టారు. గోతికాడ గుంటనక్కలా వైకాపా కూర్చుందని, కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తోందని మండిపడ్డారు. ఐదేళ్లు అధికారంలో ఉండి వైఎస్ రాజశేఖరరెడ్డి కాపులకు ఏం చేశారని నిలదీశారు. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కాపులకు ఏంచేశారో చెప్పాలని ప్రశ్నించారు. కులాల పేరుతో సమాజాన్ని ముక్కలుగా చేయాలని ఈ రెండు పార్టీలూ చూస్తున్నాయన్నారు.
పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై వైకాపా లేనిపోని దుష్ప్రచారం చేసినా ప్రజలు తిరస్కరించారని, దాంతో భంగపడిందని చంద్రబాబు అన్నారు. రాజధానిలో భూములు ఇవ్వొద్దని రైతులను రెచ్చగొట్టారని, దాన్ని రైతులు తిప్పిగొట్టారని చెప్పారు. రాయలసీమలో సైతం ప్రాంతీయ చిచ్చు పెట్టాలని చూశారని, దాన్ని సీమ ప్రజలు భగ్నం చేశారన్నారు. ఇపుడు మళ్లీ కాపులను రెచ్చగొట్టి సమాజంలో ఘర్షణ వాతావరణం పెంచాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. వీటన్నింటి వెనుక ఉన్న కారణం ఒక్కటేనని, తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నామనే భయమేనని అన్నారు. పార్టీ ఉనికి కోసం సమాజంలో ఘర్షణలు సృష్టించాలని, అశాంతిని రెకెత్తించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. కాపుల సంక్షేమానికి తెలుగుదేశం కట్టుబడి ఉందని, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి గౌరవించిందని, గత బడ్జెట్‌లో వంద కోట్లు కేటాయించిందని గుర్తుచేశారు. ప్రత్యేకంగా కాపు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిందని, రిజర్వేషన్ అంశం పరిశీలించేందుకు జస్టిస్ మంజునాధ్ నేతృత్వంలోని బిసి కమిషన్‌ను పునర్‌వ్యవస్థీకరించిందని అన్నారు. తొమ్మిది నెలల్లో కమిషన్ నివేదిక ఇస్తుందని తెలిపారు. కాంగ్రెస్, వైకాపాల మాదిరిగా కాపులు, బీసీల మధ్య ఘర్షణ పెట్టడం తెదేపా లక్ష్యం కాదని అన్నారు. రాజకీయాలు కాదు, కావల్సింది పేదరిక నిర్మూలని అని చంద్రబాబు అన్నారు. కాపులలో పేదరికం పోవాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. బిసిలకు వెన్నుముకగా భావించే తెలుగుదేశం పార్టీ ఊహలో కూడా బీసీలకు అన్యాయం చేయదని, తెలుగుదేశం పార్టీ పెట్టిందే బీసీల కోసమని అన్నారు. కొంతమంది కుట్రదారులు తామేదో బీసీలను బిసిలకు ఉద్ధరిస్తామంటూ కాపుల ప్రస్తావన తెచ్చి బిసిలను తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలని అనుకుంటే అది జరగని పని అన్నారు. అన్ని వర్గాల ఆమోదంతో బిసిలకు నష్టం జరగని రీతిలో కాపులకు న్యాయం చేయడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమన్నారు. ప్రణాళికాబద్ధమైన, సామరస్యపూర్వక పరిష్కారానికి వ్యతిరేకంగా ఘర్షణ వాతావరణం పెంచాలని చూస్తున్న వారి ప్రయత్నాలను ప్రోత్సహించవద్దని విజ్ఞప్తి చేశారు.