రాష్ట్రీయం

రైతు కాదిక బైతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 7: పాస్‌పోర్టు కంటే పగడ్బందీగా రైతులకు పాస్ పుస్తకాలు అందించనున్నట్టు సిఎం కె చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవాన శుభారంభం చేస్తామన్నారు. భూ రికార్డుల ప్రక్షాళనపై సోమ, మంగళవారాల్లో జరిగిన సుదీర్ఘ చర్చకు సిఎం కెసిఆర్ సమాధానమిస్తూ పాస్ పుస్తకాల పంపిణీ రోజున ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో రైతులకు పాస్ పుస్తకాలు అందిస్తారన్నారు. 26 భద్రత అంశాలు పొందుపర్చి పాస్ పుస్తకాలు రూపకల్పన చేస్తున్నట్టు ప్రకటించారు. అత్యంత రక్షణ ప్రమాణాలతో తయారుచేస్తున్న పాస్ పుస్తకాన్ని నెల రోజులపాటు నీటిలో ఉంచినా చెడిపోదన్నారు. కోర్ బ్యాంకింగ్ తరహాలో పాస్ పుస్తకాల్లో వివరాలు ఉంటాయని వివరించారు. చిన్న ఏటీఎం కార్డుతో ఖాతాలో ఉన్న మొత్తం, ఎంత తీశాము, ఇంత ఎంత ఉంది? అన్న వివరాలు చిన్న స్లిప్‌లో ఎలా తెలుస్తున్నాయో, పాస్ బుక్‌లోనూ అదేవిధంగా సమగ్ర సమాచారం ఉంటుందన్నారు. దీంతో లంచాలకు ఆస్కారం ఉండదని, పైరవీకారులు, భూ ఆక్రమణదారులు, డబుల్ రిజిస్ట్రేషన్ల వంటి వాటికి చరమగీతం పాడవచ్చన్నారు. భూముల లెక్కలు తీయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన ఎప్పటిలోగా పూర్తి చేస్తారన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టివిక్రమార్క ప్రశ్నకు
సిఎం సమాధానమిస్తూ జనవరి 26న ముగింపు పలకుతామన్నారు. భూ రికార్డుల ప్రక్షాళనపై సుమారు 30నుంచి 40సార్లు సమావేశమై చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నట్టు సిఎం చెప్పారు. వందశాతం పారదర్శకంగా ప్రక్షాళన జరుగుతుందని ఆయన వివరించారు. తహశీల్దార్లకు సబ్- రిజిస్ట్రార్ల అధికారాన్ని అప్పగిస్తున్నామని అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో తహశీల్దార్లే రిజిస్ట్రార్లుగా వ్యవహారిస్తున్నారని తెలిపారు. 141 రిజిస్ట్రేషన్ కార్యాలయాలను కొనసాగిస్తామన్నారు. రెవెన్యూ కార్యాలయంలో పని చేసేందుకు వెయ్యిమంది ఐటి అధికారులను నియమిస్తామని ఆయన తెలిపారు. రైతులు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి ఒకసారి వెళ్తే సరిపోతుందని, భూముల క్రయ విక్రయాలు ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చన్నారు. రైతుల పాస్ పుస్తకాలు కొరియర్ ద్వారా ఇంటికే వస్తాయని సిఎం కెసిఆర్ వివరించారు.
రెండు విధాలా భూప్రక్షాళన
భూ ప్రక్షాళన రెండు విధాలుగా చేపట్టామని కెసిఆర్ వివరించారు. న్యాయపరమైన చిక్కులున్న భూములు, అటవీ భూముల జోలికి ప్రస్తుతం వెళ్ళడం లేదన్నారు. కుటుంబ సభ్యుల మధ్యనున్న భూ వివాదాల తావుకూ పోవొద్దని అధికారులకు సూచించామన్నారు. గ్రామ సభ నిర్వహించి ప్రస్తుతం ప్రజలకు ఆమోదంగావుండే భూములను మాత్రమే నమోదు చేయాల్సిందిగా అధికారులకు సూచించినట్టు వివరించారు.
రైతు సమన్వయ సమితిల జోక్యం
రైతు సమన్వయ సమితిల జోక్యం ఏమాత్రం ఉండదని, భూప్రక్షాళనలో వాళ్లు తలదూర్చరని తెలిపారు. వెబ్ ల్యాండ్ సంగతి భగవంతునికే తెలుసని, తనకు అర్థం కాలేదన్నారు. భూప్రక్షాళనను హార్డ్ కాపీ చేయమన్నామని, దానిని సాఫ్ట్‌కాపీగా మార్చిన తర్వాత ఎమ్మెల్యేకు ఇస్తామన్నారు. ఏ గ్రామంలో ఎవరివద్ద ఎంత భూమి ఉందో ఆ ఎమ్మెల్యేకు తెలిసేలా చేస్తామన్నారు. అసైన్డ్ భూముల్లో ఉన్నవారికి అన్యాయం జరగనీయమన్నారు. అసైన్డ్ భూములు లాక్కొన్నట్లయితే వారిని కఠినంగా శిక్షస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
రాష్ట్రంలో 2.76 కోట్ల ఎకరాలు
రాష్ట్ర భూభాగం 2.76 కోట్ల ఎకరాలున్నట్టు సిఎం వివరించారు. 10,885 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని, 10,806 గ్రామీణ ప్రాంత రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని వివరించారు. గ్రామీణ ప్రాంత రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేయాలని సూచించామని, ముందుగా వారికి పెట్టుబడి ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 1418 బృందాలు రేయింబవళ్లు తిరుగుతూ సర్వే చేస్తున్నారని అభినందించారు. 14 జిల్లాల్లో 90 శాతం భూరికార్డుల ప్రక్షాళన పూరె్తైందన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి పట్టణ భూముల రికార్డులను తేలుస్తామన్నారు.
సాదా బైనామాల్లో రికార్డు
సాదా బైనామాల్లో తాము రికార్డు సృష్టించామని సిఎం చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 2,93,654 దరఖాస్తులు వస్తే ఫీజు తీసుకుని 11,653 దరఖాస్తులను పరిష్కరించగా, తాము అధికారం చేపట్టిన తర్వాత సాదా బైనామాల కోసం 11,19,111 దరఖాస్తులు రాగా 6,18,388 పరిష్కరించామని, పైగా తాము ఫీజు తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో 55 లక్షల మంది రైతులు ఉన్నారని ఆయన తెలిపారు. భూముల పరిశీలన కోసం చేపట్టిన కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాకు వందల కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చారని ప్రతిపక్షాలు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. కేవలం 7 కోట్ల 35 లక్షలు మాత్రమే ఇచ్చామని, అవసరమైతే ఇంకా ఇస్తామన్నారు.
నరుూం ముఠాకు కారకులు?
గ్యాంగ్‌స్టర్ నరుూంలాంటి నరరూప రాక్షసులను ఎవరు సృష్టించారని సిఎం ప్రశ్నించారు. నరుూం సాధారణ ప్రజల భూములను లాక్కున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. నరుూం భూములంటూ సభ్యులు మాట్లాడారని, నరుూం భూముల జాబితా వేరే ఉంటుందా? అని ఆయన ప్రశ్నించారు. నరుూం ఆక్రమిత భూములను సభ ముందు పెడతామన్నారు. మియాపూర్ భూముల వివరాలు సభలో పెడతామని, చర్చకూ సిద్ధమేనని అన్నారు.
గత ప్రభుత్వాల వల్లే..
గత ప్రభుత్వాల నిర్వాహకం వల్లే రైతులకు ఈ పరిస్థితి దాపురించిందని కెసిఆర్ విమర్శించారు. శామీర్‌పేట మండలంలోని లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన రెవెన్యూ మ్యాప్ లేదన్నారు. కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండలంలో ఒక్కొక్క గ్రామంలో భయంకరమైన నిజాలు బయటపడ్డాయని అన్నారు. పైరవీకారులు చెలరేగిపోయారని, డబుల్ రిజిస్ట్రేషన్లు జరిగాయని విమర్శించారు. ఇదంతా గత ప్రభుత్వాలు భూరికార్డులను ప్రక్షాళన చేయకపోవడమే కారణమని ముఖ్యమంత్రి కెసిఆర్ దుయ్యబట్టారు.
*
రైతన్నకు కేసీఆర్
నీతులు బోధించకుండ నిజముగ తన చే
యూత నొసగి ఆదుకొనుచు
రైతే రాజై వెలయగ రాజ్యము చేయున్