రాష్ట్రీయం

మహానుభావుడు.. నిజాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 7: మహానుభావుడు నిజాం అంటూ ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీ సాక్షిగా మరోసారి పొగడ్తలు కురిపించారు. ప్రపంచంలో ఎవరూ చేయని మంచి పనులు చేశారంటూ పొగిడారు. గతంలోనూ కెసిఆర్ నిజాంను పొగడినపుడు బిజెపి నేతలు, పలు సంఘాలు తీవ్ర అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. భూముల రికార్డుల ప్రక్షాళన అంశంపై సోమ, మంగళవారం అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ చర్చకు సిఎం కెసిఆర్ సమాధానమిస్తూ నిజాం ప్రభువుపై కొంతమందికి వేర్వేరు అభిప్రాయాలు ఉండవచ్చన్నారు. కానీ ప్రపంచంలో ఎవరూ చేయని మంచి పనులు నిజాం చేశారన్నారు. 1932-34 మధ్య కాలంలో ఉన్న నిజాం రాజు భూముల లెక్కలు తీశారని వివరించారు. ముఖ్యంగా తహశీల్ వ్యవస్థను చేపట్టిన మహానుభావుడు సాలార్‌జంగ్-1 అని చెప్పారు. తర్వాత సాలార్‌జంగ్-2 ఈ ప్రక్రియను పూర్తి చేశారని వివరించారు. ‘జల్, జంగిల్, జమీన్’ పేరిట ఉద్యమం వస్తే హేమన్ డార్ప్‌తో కమిషన్ వేసి ఆదిలాబాద్ జిల్లాలో లక్ష ఎకరాలు ఆదివాసీలకు పంచారని ఆయన నిజాం రాజును ప్రశంసించారు. నిజాం హయాంలో జరిగిన మంచి పనులను గత ప్రభుత్వాలు చెరిపి వేశాయని విమర్శించారు. నిజాం రాజు ఒక రాజుగా ఉంటూ సర్వస్వతంత్ర హైకోర్టును ఏర్పాటు చేశారని అన్నారు. ఇక మాజీ ప్రధాని పివి నర్సింహారావు ల్యాండ్ సీలింగ్ చట్టం తెచ్చారన్నారు. భూముల పంపిణీ అశాస్ర్తియంగా ఉండటం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని అన్నారు. భూముల రికార్డులు సక్రమంగా ఉంటే వృద్ధి రేటు పెరుగుతుందన్నారు. అసైన్డ్ భూముల క్రయ విక్రయాలపై సానుకూలంగా ఉన్నామని, ఆంధ్రతో పోల్చుకుంటే తెలంగాణ రెవెన్యూ చట్టం భిన్నంగా ఉందని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు.