రాష్ట్రీయం

బాలల బయోస్కోప్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 7: రాష్ట్ర రాజధానిలో బుధవారం నుంచి వారంపాటు సినిమా పండుగ జరగబోతోంది. 20వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాన్ని నేటినుంచి 14 వరకు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరిగాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 13 థియేటర్లతో పాటు రాష్టవ్య్రాప్తంగా ఉన్న మిగతా 29 జిల్లాల్లో ఎంపిక చేసిన థియేటర్లలో చిత్రాల ప్రదర్శన నిర్వహిస్తున్నారు. చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఆఫ్ ఇండియా, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నాయి. బుధవారం సాయంత్రం శిల్పకళాతోరణంలో ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మంగళవారం సమీక్షించారు. హైదరాబాద్ (ఐమాక్స్ థియేటర్)లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బాలల చలన చిత్రోత్సవం పిల్లల్లో సృజనాత్మక శక్తిని పెంచుతుందని, మంచి నడవడికకు దోహదపడుతుందన్నారు. బాలల చిత్రోత్సవ వేడుకలకు హైదరాబాద్ నగరం సరైన నగరమని, ఇక్కడ వాతావరణం ఆహ్లాదంగా ఉంటుందన్నారు.
31 దేశాల నుండి 300 మంది ‘చైల్డ్ డెలిగేట్స్’ వేడుకలకు హాజరవుతున్నారు. తెలంగాణ నుంచి 50 మంది పిల్లలు చైల్డ్ డెలిగేట్స్‌గా హాజరవుతారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న వర్క్‌షాప్‌లో బాలబాలికల చిత్ర నిర్మాణం, కథారచన, యానిమేషన్ తదితర అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. బాలల చలన చిత్రోత్సవం స్ఫూర్తిదాయక సందేశాన్ని రాష్ట్ర నలుమూలలకు తీసుకుపోయేందుకు తొలిసారిగా జిల్లా కేంద్రాల్లోనూ చిత్రాల ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు.
ప్రస్తుతం నిర్వహిస్తున్న చలన చిత్స్రోవాల్లో పాల్గొంటున్న చైల్డ్ డెలిగేట్స్ సంఖ్య గతంలోకంటే ఎక్కువగా ఉందని చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఆప్ ఇండియా సిఈఓ శ్రవణ్‌కుమార్ తెలిపారు. ప్రస్తుత ఉత్సవాలు ప్రత్యేక ప్రతిపత్తి సంతరించుకున్నాయన్నారు. లిటిల్ డైరెక్టర్స్ విభాగంలో ప్రదర్శించే పిల్లలే తీసిన పిల్లల చిత్రాల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. 31 దేశాల నుండి లిటిల్ డైరెక్టర్ విభాగంలో ‘చిన్నారి దర్శకులు’ పాల్గొంటున్నారని వివరించారు. వివిధ దేశాల్లో నిర్వహించే బాలల చిత్రోత్సవాల్లో పాల్గొన్న 92మంది ప్రఖ్యాత దర్శకులు, సినిమారంగంతో సంబంధం ఉన్న వివిధ వర్శిటీల ప్రొఫెసర్లు, ఇతర ప్రముఖులు పాల్గొంటున్నారు. చలన చిత్ర రంగంలో ఆసక్తి ఉన్న చిన్నారులకు ‘లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్’గా ఉంటుందని భావిస్తున్నామన్నారు. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు శాశ్వత వేదికగా ప్రకటించే అంశం పరిశీలనలో ఉందని శ్రావణ్‌కుమార్ తెలిపారు. ప్రారంభోత్సవం సందర్భంగా ‘స్కూల్ ఛలే’గా చిత్ర ప్రదర్శన ఉంటుందని తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ తెలిపారు. చిత్రోత్సవాల్లో తెలుగు సినిమాలు పూర్ణ, నేను నా దేశం, అప్పూ తదితర సినిమాలను చేర్చారు.