రాష్ట్రీయం

శనగ.. శరభ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, నవంబర్ 7: వేరుశనగ రైతు కడుపు మండింది. ఆరుగాలం కష్టపడినా పెట్టుబడులు సైతం గిట్టుబాటు కాకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. వేరుశనగకు మద్దతు ధర కల్పించకుండా దళారులు ఇష్టానుసారం వ్యవహరిస్తూ రైతును దగా చేస్తున్నారంటూ రెచ్చిపోయారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో వేరుశనగ రైతులు తిరుగబాటుకు దిగారు. మంగళవారం వ్యవసాయ మార్కెట్ యార్డుకు వేరుశనగను పంటను రైతులు తీసుకొచ్చారు. ఖరీదుదారులు రూ.1200 నుంచి రూ. 2450 వరకు ధర నిర్ణయించడంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యాలయానికి చేరుకొని అక్కడున్న అధికారులను నిలదీశారు. తాము ఏమీ చేయలేమంటూ యార్డు అధికారులు నిస్సహాయత వ్యక్తం చేయడం రైతులకు మరింత ఆగ్రహం తెప్పించింది. యార్డులోని ఫర్నీచర్‌ను ద్వంసం చేయడంతోపాటు బీరువాలను, టేబుళ్లను ధ్వంసం చేశారు. ప్రధాన కార్యాలయం తలుపులు, అద్దాలను బద్దలుకొట్టారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ, ఎస్పీ విజయ్‌కుమార్‌లు సంఘటన స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. గిట్టుబాటు ధర కల్పించేందుకు తమవంతు ప్రయత్నిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
ఆస్తుల ధ్వంసం తగదు: కలెక్టర్
ఏదైనా సమస్యవుంటే తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం సరైందికాదని కలెక్టర్
రజత్‌కుమార్ సైనీ, ఎస్పీ విజయ్‌కుమార్‌లు సూచించారు. ప్రభుత్వ మద్దతు ధర విషయంలో తమవంతు సహకారం అందిస్తామని అంటూనే, తెచ్చిన పంటకు సరైన గ్రేడ్ లేకపోవడంవల్లే ధరలు తగ్గుముఖం పట్టడాన్ని రైతులు గ్రహించాలన్నారు. సంఘటనపై పోలీస్ దర్యాప్తు నిర్వహిస్తామని, రైతు ముసుగులో దాడులకు దిగితే అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్‌వెంట యార్డు చైర్మన్ లక్ష్మీదేవి, వైస్ చైర్మన్ నజీర్, జిల్లా మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, కార్యదర్శి మల్లేశం, వ్యవసాయ అధికారులు తదితరులు ఉన్నారు.

చిత్రం..గద్వాల మార్కెట్ యార్డులో ధ్వంసమైన ఫర్నీచర్