రాష్ట్రీయం

మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 7: పరీక్షల సీజన్ మొదలైంది. తెలంగాణ ఇంటర్ బోర్డు పరీక్షలకు సంబంధించిన తాత్కాలిక షెడ్యూలును రూపొందించి ప్రభు త్వ అనుమతికి పంపింది. ముసాయిదా షెడ్యూలు ప్రకారం మొదటి ఏడాది పరీక్షలు 2018 మార్చి 1 నుంచి మొదలవుతాయి. రెండో ఏడాది పరీక్షలు మార్చి 3 నుంచి జరుగుతాయి. ఫిబ్రవరి 2 నుంచి 22 వరకూ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఎథిక్స్ హ్యుమన్ వాల్యూస్ పేపర్‌ను జనవరి 29న, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పేపర్ జనవరి 31న జరుగుతుంది. ఈ రెండు పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకూ జరుగుతాయి. మిగిలిన రెగ్యులర్ పరీక్షలు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 వరకూ జరుగుతాయి.
ఫస్టియర్ పరీక్షలు..
మార్చి 1న పార్టు -2 సెకండ్ లాంగ్వేజి, 5న పార్టు -1 ఇంగ్లీషు-1, 7న పార్టు-3 మాథ్స్-1, బోటనీ-1, సివిక్స్-1,
సైకాలజీ-1, మార్చి 9న మాథ్స్-2, జువాలజీ-1, హిస్టరీ-1, మార్చి 12న ఫిజిక్స్-1, ఎకనామిక్స్-1, క్లాసికల్ లాంగ్వేజి పేపర్, మార్చి 14న కెమిస్ట్రీ-1, కామర్స్-1, సోషియాలజీ-1 , ఫైన్ ఆర్ట్సు, మ్యూజిక్, మార్చి 16న జియాలజీ-1, హోం సైన్స్ -1, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ -1, బ్రిడ్జికోర్సు మాథ్స్-1, మార్చి 19న మోడరన్ లాంగ్వేజి పేపర్-1 జరుగుతాయి
సెకండియర్ పరీక్షలు
మార్చి-3న సెకండ్ లాంగ్వేజి పేపర్-2, మార్చి 6న ఇంగ్లీషు పేపర్-2, మార్చి 8న మాథ్స్ పేపర్-2, బోటనీ పేపర్-2, సివిక్స్ పేపర్-2, సైకాలజీ-2, మార్చి 10న మాథ్స్ పేపర్ -2బి, జువాలజీ -2, హిస్టరీ -2, మార్చి 13న ఫిజిక్స్ -2, ఎకనామిక్స్-2, క్లాసికల్ లాంగ్వేజి , మార్చి 15న కెమిస్ట్రీ -2, కామర్స్ -2, సోషియాలజీ -2, ఫైన్ ఆర్ట్సు, మ్యూజిక్ -2, మార్చి 17న జియాలజీ-2, హోంసైన్స్-2, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-2, లాజిక్ పేపర్-2, బ్రిడ్జికోర్సు మాథ్స్-2 , మార్చి 20న మోడరన్ లాంగ్వేజి పేపర్-2, జాగ్రఫీ పేపర్-2 జరుగుతాయి.