రాష్ట్రీయం

మాజీ ఎంపీ బసవపున్నయ్య మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేపల్లె, నవంబర్ 8: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ సింగం బసవపున్నయ్య (98) బుధవారం తెల్లవారుజామున గుంటూరులోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో మృతి చెందారు. సింగం బసవపున్నయ్య స్వగ్రామం గుంటూరు జిల్లా రేపల్లె పట్టణం. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే 15 రోజుల క్రితం సింగం బసవపున్నయ్య కుమారుడు, న్యాయవాది సింగం గోపినాథ్ తీవ్ర గుండెపోటుతో మృతి చెందారు. అసలే వయోభారంతో అస్వస్థతతో ఉన్న సింగం బసవపున్నయ్య కుమారుడి మృతి తరువాత మానసికంగా మరింత కుంగిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు గుంటూరులోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చేర్పించి చికిత్స ఇప్పిస్తుండగా చికిత్స ఫలించక బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
అసలు సింగం బసవపున్నయ్యది కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలంలోని మోదుమూడి గ్రామం. ఆ గ్రామం నుండి రేపల్లె పట్టణానికి వలస వచ్చి రేపల్లెలో స్థిరపడి న్యాయవాది వృత్తిని చేపట్టి న్యాయస్థానంలోని అనేక కేసుల్లో విజయం సాధించి మంచి న్యాయవాదిగా పేరుగాంచారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన సేవలను గుర్తించిన పార్టీ హైకమాండ్ 2004 లోక్‌సభ ఎన్నికల్లో తెనాలి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీకి అవకాశం కల్పించగా, టీడీపీ అభ్యర్థి, సినీనటి శారద మీద పోటీ చేసి ఘన విజయం సాధించారు.
ఆ తరువాత 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తిరిగి సినీనటి శారద చేతుల్లోనే పరాజయం పాలయ్యారు. కొంతకాలం పార్టీకి సేవలందిస్తూ గుంటూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా కొనసాగారు. అనంతరం రెండుసార్లు ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఇలాఉంటే కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, సీపీఐ, సీపీఎం, ప్రజాసంఘాల నాయకులు రేపల్లె పట్టణంలోని ఆయన నివాసానికి చేరుకుని మృతదేహం వద్ద నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. గురువారం ఉదయం 10 గంటలకు రేపల్లె పట్టణంలో సింగం అంతిమయాత్ర కొనసాగుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు.