రాష్ట్రీయం

మెట్రో రైలెక్కిన గవర్నర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 8: ట్రాఫిక్‌తో అష్టకష్టాలు పడే మహానగరవాసులు చిరకాల స్వప్నమైన మెట్రోరైలు ఈ నెల 28వ తేదీన ప్రదాని నరేంద్రమోది చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో బుధవారం తెలుగురాష్ట్రాల గవర్నర్ నరిసింహాన్, రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాలు, ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు మెట్రోరైలు పనులను పరిశీలించారు. ఇందులో ఇప్పటికే సిద్దమైన కారిడార్ 1లోని ఎస్‌ఆర్‌నగర్‌లో మెట్రోరైలెక్కిన గవర్నర్, మంత్రి కెటిఆర్ మియాపూర్ వరకు ప్రయాణించారు. అక్కడ మెట్రో స్టేషన్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న సుందరీకరణ పనులు, స్టేషన్‌లో తుది దశలో ఉన్న పనులను వారు పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును మెట్రోరైలు మేనేజింగ్ డైరెక్టర్ డా.ఎన్వీఎస్‌రెడ్డిని అడిగి తెల్సుకున్నారు. ఈ సందర్భంగా మెట్రోరైలుకు వినియోగిస్తున్న ఆధునిక సిగ్నలింగ్, విద్యుత్ లైన్ల గురించి, స్టేషన్లలో పిల్లలకు, మహిళలకు, వృద్దులకు కల్పిస్తున్న ఆధునిక సేవల గురించి మెట్రో ఎండి వారికి వివరంచారు. ఆ తర్వాత మియాపూర్ నుంచి తిరిగి మెట్రోరైలులో బయల్దేరిన వారు ఎస్‌ఆర్‌నగర్ స్టేషన్‌లో దిగారు.