రాష్ట్రీయం

ముస్లింలకు తోఫాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: రాష్ట్రంలోని ముస్లింలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు (కెసిఆర్) వరాల జల్లు కురిపించారు. మైనారిటీ సంక్షేమంపై శాసనసభలో గురువారం జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ, ఉర్ద్భూషను రెండో అధికార భాషగా మారుస్తామన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం, శాసనమండలి, శాసనసభ, సచివాలయం, మంత్రులు, జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో 66 మంది ఉర్దూ ఆఫీసర్లను నియమిస్తామన్నారు. మైనారిటీ ప్రజల నుండి ఉర్దూలోవచ్చే దరఖాస్తులను ట్రాన్స్‌లేషన్ చేసే బాధ్యత వీరికి అప్పగిస్తామన్నారు. ఐదోతరగతి నుండి రెసిడెన్షియల్ పాఠశాలలు నడిపిస్తున్నామని, వీటిలో 58 వేల మంది విద్యార్థులు చదువుతున్నారని వివరించారు. రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో ముస్లింలతో పాటు సిక్కులు, జైనులు, క్రైస్తవులు తదితర మైనారిటీ విద్యార్థులు కూడా చదువుకునే అవకాశం కల్పించామని వివరించారు. దశలవారీగా రెసిడెన్షియల్ విద్యాసంస్థలను నడిపేందుకు ఏటా 2,600 కోట్ల రూపాయలు అవసరం అవుతాయన్నారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజురీఇంబర్స్‌మెంట్‌ను వీలైనంత త్వరలో ఇస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కూడా మైనారిటీల సంక్షేమం పట్ల సానుకూలంగానే ఉందని తెలంగాణలో రెసిడెన్షియల్ పాఠశాలలు నడిపేందుకు కేంద్రప్రభుత్వ 230 కోట్ల రూపాయలు మంజూరు చేసి 120 కోట్లను ఇప్పటికే విడుదల చేసిందని తెలిపారు. విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లే విద్యార్థులకు ఇచ్చే నిధులకోసం విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయ పరిమితిని ఐదులక్షల రూపాయల వరకు పెంచామని, ఈ పెంపుదల ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు కూడా వర్తిస్తుందన్నారు.
స్వయం ఉపాధిపథకం కింద బ్యాంకులతో సంబంధం లేకుండా ఒకటిన్నర లక్షల రూపాయల వరకు పెట్టుబడికి అవకాశం ఉన్న యూనిట్లు అమలు చేస్తామన్నారు. పోటీ పరీక్షలను ఉర్దూలో రాసే అవకాశాన్ని కల్పిస్తామన్నారు. నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) లో కూడా ప్రశ్నాపత్రాన్ని ఉర్దూలో ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని సిఎం తెలిపారు. వక్ఫ్‌భూములను రక్షించేందుకు
ఉన్నతస్థాయి కమిటీని నియమించి, వారి సిఫార్సులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని కెసిఆర్ పేర్కొన్నారు. ఈ భూములను ముస్లింల సంక్షేమ కార్యక్రమాలైన స్కిల్ డెవలప్‌మెంట్, మహిళాసాధికారత, స్టడీ సర్కిల్స్, షాదీఖానాలు తదితర అవసరాలకు ఉపయోగిస్తామని వెల్లడించారు. హైదరాబాద్ (నాంపల్లి) లో అసంపూర్తిగా నిలిచిపోయిన హజ్‌భవన్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘షాదీముబారక్’ తరహాలోనే కేందంలోని బిజెపి ప్రభుత్వం ‘షాదీశగుణ్’ అనే పథకం ప్రవేశపెట్టి ఒక్కొక్కరికి 51 వేల రూపాయలు ఇస్తోందన్నారు.
జామియా నిజాం విద్యాసంస్థ నడిపిస్తున్న డిగ్రీకోర్సులకు ప్రభుత్వం గుర్తింపు ఇస్తామని కెసిఆర్ హామీ ఇచ్చారు. అజ్మీర్‌లో తెలంగాణ భవన్‌ను నిర్మిస్తామని, రాజస్థాన్ ప్రభుత్వం ఇందుకోసం రెండు ఎకరాల భూమిని కూడా కేటాయించిందని కెసిఆర్ తెలిపారు. జహంగీర్‌పీర్ దర్గాకు తాను శుక్రవారం వెళుతున్నానని, ఈ దర్గా అభివృద్ధికి చేపట్టే పనులను అక్కడే ప్రకటిస్తామన్నారు. వౌలాలీ దర్గాకు వెళ్లేందుకు రోడ్డు వేస్తామని కూడా హామీ ఇచ్చారు. సింగరేణి కంపెనీలో రంజాన్ పండగకు సెలవు ఇస్తామని, అలాగే క్రిస్టమస్‌కు కూడా సెలవు ఇస్తామని వెల్లడించారు. ఇమాంలు, వౌజంలకు ఇచ్చే వేతనం పెంచే అంశం పరిశీలిస్తామన్నారు. చర్చీలలో పనిచేసే పాస్టర్లు, రెవరెండ్‌లకు గౌరవవేతనం ఇచ్చే అంశం పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. మైనారిటీలకు ఇచ్చే బడ్జెట్‌ను వచ్చే సంవత్సరం మరింత పెంచుతామని వెల్లడించారు.
*
మైనారిటీ ఓట్ల కొరకు
హైనెస్సు నిజము నిజామె హైలెస్సనుచున్
నానా తోఫాలనొసగ
మైనారిటి కానివారి మనసులు నొచ్చున్!