రాష్ట్రీయం

ఐటిఎంతో శ్రీకాంత్ కిడాంబి భాగస్వామ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: ప్రముఖ ఐటిఎం గ్రూపు సంస్థ భారతదేశ ప్రముఖ బ్యాడ్మింటిన్ ఆటగాడు, నాలుగవ వరల్డ్ సూపర్ టైటిల్ విజేత శ్రీకాంత్ కిడాంబితో తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. రెండు ఆశయాలతో ఈ భాగస్వామ్యం చేసుకున్నట్లు ఐటిఎం గ్రూప్ పేర్కొంది. కిడాంబి వంటి ఆటగాళ్లను ఆదర్శంగా తీసుకుని అంకిత భావంతో విద్యార్థులు తమ కలలను నిజం చేసుకునేందుకు స్ఫూర్తి కలిగించడం ఒకటైతే, వృత్తిపరమైన క్రీడా విద్యను ప్రోత్సహించాలన్నది మరో ఉద్ధేశ్యమని ఐటిఎం సంస్థ వ్యవస్ధాపకుడు, చైర్మన్ డాక్టర్ పివి రమణ స్పష్టం చేశారు. గురువారం నాడిక్కడ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అథ్లెటిక్ కెరీర్స్‌ను నిర్మించేందుకు గాను ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ట్రైనింగ్, మెయిన్ స్ట్రీం ఎడ్యుకేషన్‌ను సమ్మిళితం చేయాలన్న ఆశయంతో ఐటిఎం తన క్యాంపస్‌లలో స్పోర్ట్స్ అకాడమిలను అభివృద్ధి చేస్తోందని అన్నారు.
ఈ అనుబంధం గురించి కిడాంబి మాట్లాడుతూ ఐటిఎంతో అనుంబంధం ఎంతో ఆనంద దాయకమని అన్నారు. విద్య పట్ల సంస్థకు ఉన్న ఆసక్తి, అంకితభావం అందరికీ తెలుసునని అన్నారు.