రాష్ట్రీయం

ఖమ్మంలో సమీకృత స్టీల్ ప్లాంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: ఖమ్మంలో సమీకృత స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఐటి, గనులు భూగర్భ శాఖామంత్రి కె తారకరామారావు పేర్కొన్నారు. గురువారం నాడు శాసనసభలో టి రామమోహన్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ, బయ్యారీం వద్ద ఇనుప ఖనిజం లభించే పరిమాణం, నాణ్యత చూస్తే నాణ్యత తక్కువగా ఉన్నట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించిందని మంత్రి చెప్పారు. బయ్యారం వద్ద ఇనుప ఖనిజ లభ్యత అవసరమైనంత పరిమాణంలోనూ తగిన నాణ్యత లేనందున, రాష్ట్రప్రభుత్వం ఇనుపఖనిజాన్ని దగ్గరలోని చత్తీస్‌ఘడ్ నుండి బయ్యారం తరలించడానికి సమాలోచనలు ప్రారంభించిందని అన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద సాంకేతిక విజ్ఞాన ఇంక్యుబేటర్‌గా టి హబ్ రూపుదిద్దుకుందని ఐటి మంత్రి కెటిఆర్ చెప్పారు. రాష్ట్రంలో ఉన్న వివిధ ఇంక్యుబేటర్లతో అనుసంథానం చేశామని తెలిపారు. నిజామాబాద్‌లో గ్రామీణ టెక్నాలజీ ఇంక్యుబేటర్‌ను ప్రారంభించామని తెలిపారు. గత రెండేళ్లలో టిహబ్ 377 స్టార్టప్‌లను ఇంక్యుబేట్ చేసిందని , పెట్టుబడి దారుల నుండి 91.65 కోట్లు సమకూరాయని చెప్పారు. 25 కార్పొరేట్ సంస్థల నుండి టి హబ్ భాగస్వామ్యం ప్రతిపాదనలను స్వీకరించిందని చెప్పారు. దాదాపు 10 స్టార్టప్‌లు అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయని ఆయన వెల్లడించారు.
అడిగినవారందరికీ పని
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అడిగిన వారందరికీ పని ఇప్పించడం జరుగుతుందని పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి తెలిపారు. 2017-18 ఆర్ధిక సంవత్సరానికి 8 కోట్ల పనిదినాలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని, వీటిని 2017 జూన్ నాటికి సాధ్యమైందని చెప్పారు. లక్షిత పనిదినాలను సవరించడం కోసం అదనంగా ఆరుకోట్ల పనిదినాలను మంజూరు చేయమని కేంద్రాన్ని కోరామని అన్నారు.
బీసీలను ఆదుకుంటాం
బిసిలు ఆదుకుంటామని, ఎంబిసిలను గుర్తించి నివేదిక పంపమని బిసి కమిషన్‌ను కోరామని అది రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని బిసి సంక్షేమ మంత్రి జోగు రామన్న తెలిపారు.
ఐలయ్య పుస్తకం పై రగడ
కంచె ఐలయ్య రాసిన పుస్తకం కులాలు మధ్య చిచ్చురేపిందని, దానిని నిషేధించాలని ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్, గణేష్‌లు చేసిన విజ్ఞప్తిపై మంత్రి హరీష్‌రావు స్పందిస్తూ సభ్యల డిమాండ్ ప్రభుత్వ పరిశీలనలో ఉందని అన్నారు.