రాష్ట్రీయం

గిరిజన రైతుల నిలువు దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, నవంబర్ 9: అనుమతులు లేకుండానే వ్యాపారాలు చేస్తూ తమ మాటలతో, చేతలతో అమాయక గిరిజనులను మోసం చేస్తున్న వైనమిది. తెలంగాణ రాష్ట్రంలోని సుమారు 12జిల్లాల్లో ఈ తరహా వ్యాపారం ముమ్మరంగా సాగుతోంది. రైతులు పోడు చేసుకొని పండించిన ధాన్యాన్ని వ్యాపారులు పడికట్టి నాణ్యతాలోపం పేరుతో తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే పంటలకు తెగుళ్ళు సోకి నష్టపోయిన రైతులకు ఇది మరింత ఇబ్బందిగా మారింది. గతంలో సొసైటీలు, డ్వాక్రా సంఘాలు ధాన్యం కొనుగోలు చేసేవి. కాని డ్వాక్రా ఉద్యోగులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో వ్యాపారులు తమకు అనుకూలమైన ధరను చెల్లిస్తూ గిరిజనులను మోసం చేస్తున్నారు. తూకంలో పడికట్టి రైతులను ఇబ్బందులపాలు చేస్తున్నారు. తాము కొనుగోలు చేసిన ధాన్యాన్ని సమీపంలోని వ్యవసాయ మార్కెట్‌కు తరలించి అమ్మేవారు కొందరైతే మరికొందరు నేరుగా రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. తరలించేందుకు అనుమతులు ఇస్తున్న అధికారులు కాటాల విషయంపై స్పందించకపోవడం విశేషం. కొంతమంది ధాన్యం వ్యాపారులు రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని రాళ్ళతోనే కాటాలు వేస్తున్నారు. నిబంధనల ప్రకారం సీలువేసిన రాళ్ళతోనే కాటాలు పట్టాలి. లైసెన్సులు ఉండాలి. కాని కొత్తగూడెం, భూపాలపల్లి, వరంగల్, అసిఫాబాద్, పెద్దపల్లి, వరంగల్ రూరల్, మహబూబాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల పరిధిలోని ఏజన్సీ గ్రామాల్లో ఈ తరహా వ్యాపారం జోరుగా సాగుతున్నది. 75కిలోల బస్తాకు అతితక్కువ ధరను చెల్లిస్తున్నారు. నాటురాళ్ళు, బస్తాలతో పొలాల వద్దనే కర్రలు కట్టి తూకాలు వేస్తున్నారు. దీంతో 75కేజీల బస్తాకు ఆరునుంచి 8కేజీల వరకు మోసం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి జిల్లాలో సుమారు 45నుంచి 60మంది ధాన్యం వ్యాపారులు లైసెన్స్ లేకుండానే వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఎటు చూసినా నిత్యం ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. మార్కెట్ కమిటీ అధికారులు, తూనికలు, కొలతల, రెవెన్యూ శాఖల అధికారులు కనీసం పట్టించుకోకపోవడం గమనార్హం.

చిత్రం..పొలంవద్దనే కర్రలతో కట్టి కాటాలు వేస్తున్న దృశ్యం