రాష్ట్రీయం

15శాతం వృద్ధిరేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 30: ప్రభుత్వ పాలనలో అవినీతికి తావులేకుండా చూస్తానని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శనివారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించిన సత్య ప్రకాశ టక్కర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ ప్రభుత్వ పనులు వేగంగా పూర్తయ్యేలా చూస్తానని, ఫైళ్లు త్వరగా పరిష్కరించేలా చూస్తానని, తద్వాత అవినీతి లేకుండా చూడవచ్చన్నారు. ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్న తనకు ప్రభుత్వం ఏ బాధ్యత అప్పగించినా శ్రద్ధగా పూర్తి చేస్తున్నానని, అలాగే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడంతో మరింత ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల మధ్య సమన్వయం ఉండేలా చూస్తూ, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు సజావుగా అమలయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం ప్రభుత్వం ముందున్న పెద్ద సమస్యగా చెబుతూ, వ్యవసాయం, అనుబంధ రంగాలైన పాడి, మత్స్య తదితర రంగాలను పటిష్టం చేయడం ద్వారా యువత సేవలు ఎక్కువగా వినియోగించుకోవాల్సి ఉందన్నారు. తద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించేందుకు వీలవుతుందన్నారు.
రాష్ట్రంలో ఈ ఏడాది 11శాతం వృద్ధిరేటు ఉంటుందని అంచనా వేస్తున్నామని, వచ్చే ఏడాది 15 శాతం వృద్ధిరేటు సాధించాలన్నది లక్ష్యమన్నారు. 15 శాతం వృద్ధిరేటు సాధించిన ఘనత దేశంలో ఇప్పటి వరకు తమిళనాడు, బీహార్ రాష్ట్రాలకు సాధ్యమైందని, ఇప్పుడు ఆంధ్ర 15శాతం వృద్ధిరేటు సాధించి చరిత్ర సృష్టించబోతోందన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సిఎం చంద్రబాబు సూచనల మేరకు ఖచ్చితమైన ప్రణాళికను రూపొందించి అమలు చేస్తామన్నారు. నిర్మాణంలోని భారీ, మధ్యతరహా, చిన్నతరహా నీటిపారుల ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడంతో పాటు 15 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు గొట్టపుబావుల తవ్వకాన్ని చేపట్టాలన్న ఆలోచన ఉందన్నారు.
స్థానిక సంస్థలను బలోపేతం చేస్తామని, 73-74వ రాజ్యాంగ సవరణలను తుచ తప్పకుండా అమలు చేస్తామన్నారు. స్థానిక సంస్థల్లో వౌలిక సదుపాయాల కల్పనకు 40 వేల కోట్ల రూపాయల నిధులు లభించేలా ప్రణాళిక రూపొందించామని టక్కర్ వివరించారు. సిఎస్‌గా అన్ని రంగాలపై దృష్టి కేంద్రీకరిస్తానని, ప్రధానంగా విద్య, వైద్య రంగాలను ప్రజల చేరువకు తీసుకెళ్తామని టక్కర్ వివరించారు. భారతీయ వైద్యానికి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.
రాజధాని అమరావతి నిర్మాణం ఛాలెంజ్‌గా తీసుకుని, పరిపాలనాపరంగా వేగంగా పనులు జరిగేలా చూస్తానని కొత్త ప్రధాన కార్యదర్శి వివరించారు. ఈ అంశంలో ఇప్పటికే సిఎం నిరంతరం శ్రమిస్తున్నారని, ఎగ్జిక్యూటివ్ పరంగా పూర్తిశ్రద్ధతో పనిచేస్తానని వివరించారు. రాష్ట్ర పాలనలో కీలకమైన హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్స్ తరలింపు నిర్ణీత సమయంలో పూర్తవుతుందని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ప్రభుత్వోద్యోగులంతా తనకు పూర్తిగా సహకరించాలని కోరారు.
చిత్రం...

కొత్త సిఎస్ ఎస్.పి. టక్కర్