రాష్ట్రీయం

సాగుకు కొత్త జవసత్వాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 15: వ్యవసాయ రంగంలో సంస్కరణలు చేపట్టడానికి బహుముఖ వ్యూహాన్ని అనుసరించాలని ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సిఐఐ, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్, డల్‌బెర్గ్ సంయుక్తంగా విశాఖలోని సిఐఐ గ్రౌండ్స్‌లో మూడు రోజులపాటు నిర్వహించనున్న ఏపీ అగ్రిటెక్ సమ్మిట్-2017ను ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒడిదుడుకుల్లో ఉన్న సాగు రంగానికి జవసత్వాలు నింపాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, శాస్తవ్రేత్తలు, యూనివర్శిటీలపై ఉందన్నారు. వ్యవసాయం లేకపోతే ఆహార భద్రత లేదన్న నిజాన్ని అనేక దేశాలను చూసి నేర్చుకున్నాం. ఆహారపు అలవాట్లల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చాలామంది పండ్లు, చేపలు, కార్న్, చికెన్, డెయిరీ పదార్థాలపై మక్కువ చూపుతున్నారు. ఈ దిశగా రైతుల దృష్టిని మళ్లించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్రాలపై ఉందన్నారు. వ్యవసాయరంగ స్థిరీకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా, అవి సరిపోవన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే, రైతులు వ్యవసాయాన్ని వదిలేసి, ప్రత్యామ్నాయం చూసుకుంటారని, అప్పుడు దేశంలో ఆహార కొరత ఏవిధంగా ఉంటుందో ఊహించుకుంటనే భయం వేస్తుందన్నారు. రైతు వేసిన పంట చేతికొచ్చే వరకూ నమ్మకం లేదు. వాతావరణ పరిస్థితులు, మార్కెట్ సౌకర్యాల లేమి, దళారుల బెడద వంటి అనేక సమస్యలతో రైతులు సతమతవుతున్నారని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం, నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా లేమి, ఏయే పంటలు లాభదాయకంగా ఉంటాయో రైతుల్లో అవగాహన కల్పించకపోవడం వంటి అనేక కారణాతో రైతులు కుదేలైపోతున్నారన్నారు. ఈ పరిస్థితులే రైతుల ఆత్మహత్యలకు దారితీస్తున్నాయని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. డెయిరీ, పౌల్ట్రీ రైతుల్లో ఇంతటి దయనీయ పరిస్థితి లేదన్న విషయాన్ని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. పండించిన
పంట చెడిపోకుండా ఉండాలంటే, దేశంలోని ప్రతి పంచాయతీలోను కోల్డ్ స్టోరేజ్ ఉండాలి. అలాగే గోడౌన్లు పెద్ద ఎత్తున నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.
పెద్ద నోట్లను రద్దు చేయడం వలన అధిక మొత్తం బ్యాంకులకు వారి వారి అడ్రస్‌లతో సహా తిరిగి వచ్చిందని ఉపరాష్టప్రతి చెప్పారు. దీనివలన బ్యాంకులు వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గించాయని అన్నారు. ఇటువంటప్పుడే రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాల్సి బాధ్యతను ప్రభుత్వాలు తీసుకోవాలని ఆయన సూచించారు. రైతు పండించిన పంట నేరుగా విక్రయించుకునేందుకు వీలుగా షరతులు లేని మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించాలని అన్నారు. అలాగే భూసార పరీక్షలతో సహా, వివిధ పంటలకు సంబంధించిన పూర్తి వివరాలు రైతులకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. దేశంలోని వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, సదస్సుకు వచ్చిన కంపెనీల యాజమాన్యాలు కూలంకషంగా చర్చించి, పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని ఉప రాష్టప్రతి విజ్ఞప్తి చేశారు.
రైతుల కళ్ళలో ఆనందం చూడాలని..
సదస్సులో సిఎం చంద్రబాబు మాట్లాడుతూ రైతులు ఎప్పుడూ ఆనందంగా జీవించాలన్నదే తన ధ్యేయమని, అందుకే వ్యవసాయరంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. భూసార పరీక్షలు త్వరితగతిన నిర్వహించి, ఫలితాలు వెలవరించేందుకు డ్రోన్ టెక్నాలజీని మన రాష్ట్రంలో అమలు చేసేందుకు బిల్‌గేట్స్ సంస్థ ముందుకు రావడం ముదావహనమన్నారు. రాష్ట్రంలో చిన్న, మధ్యతరహా రైతులు అధికంగా ఉన్నారని, వారి సామర్థ్యాలను పెంపొందించేందుకు వివిధ కార్యక్రమాలు రూపొందిస్తున్నామని తెలిపారు. సాగురంగంలో 20 నుంచి 25 శాతం వృద్ధి రేటు సాధించేందుకు కృషి చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. వ్యవసాయరంగాన్ని, ఇతర రంగాలతో అనుసంధానం చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఉద్యానవన పంటలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని ఉద్యానవన హబ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ఆక్వా హబ్‌గా రూపుదిద్దుకునే అవకాశం ఉందని ఆయన తెలియచేశారు. బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ అగ్రికల్చర్ ఆసియా హెడ్ డాక్టర్ పూర్వీ మెహతా మాట్లాడుతూ భారత వ్యవసాయ రంగం కొంత పుంతలు తొక్కబోతోందని అన్నారు. వ్యవసాయం లాభసాటిగా ఉండాలని కోరుకుంటున్న చంద్రబాబు కలలను నెరవేరనున్నాయని ఆమె అన్నారు. కార్యక్రమంలో మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావు, పైడికొండ మాణిక్యాలరావు, ఎంపిలు అవంతి శ్రీనివాసరావు, హరిబాబు, సిఐఐ అధ్యక్షురాలు శోభనా కామినేని, వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ తదితరులు ప్రసంగించారు.
భూసార పరీక్షలకు డ్రోన్ టెక్నాలజీ వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలను ఇచ్చి పుచ్చుకున్నారు.

చిత్రం.. ఏపీ అగ్రిటెక్ -2017 సదస్సులో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ఉప రాష్టప్రతి వెంకయ్య. చిత్రంలో సిఎం చంద్రబాబు