రాష్ట్రీయం

రికార్డు టైంలో పవర్ ప్లాంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 15: కొత్తగూడెం థర్మల్ ప్లాంట్ నిర్మాణం పూర్తయింది. వచ్చే నెలలో సిఎం కె చంద్రశేఖరరావు ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత 36 నెలల్లో థర్మల్ ప్లాంట్ నిర్మాణం పూర్తికావడం విశేషం. ఈ ప్రాజెక్టును బిహెచ్‌ఇఎల్ నిర్మించింది. ఈ ప్రాజెక్టుకు రూ. 3810 కోట్ల వ్యయమైంది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ ప్రాతిపదికన ప్లాంట్‌ను నిర్మించారు. 800 మెగావాట్ల విద్యుత్ థర్మల్ ప్లాంట్ నిర్మాణం 36 నెలల్లో పూర్తి కావడం దేశంలో తొలిసారి. దీంతో కెటిపిఎస్ కెపాసిటీ 2620 మెగావాట్లకు చేరుకుంది. ఇప్పటికే కెటిపిఎస్‌లో ఆరు యూనిట్లు పనిచేస్తున్నాయి. ఈ ఆరు యూనిట్ల కెపాసిటీ 1820 మెగావాట్లు. భద్రాద్రి థర్మల్ ప్లాంట్ 1080 మెగావాట్ల కెపాసిటీతో నిర్మించనున్నారు. ఈ ప్లాంట్ నిర్మాణం పనులు కూడా వేగవంతం చేశారు. తెలంగాణ జెన్కో ఈ ప్లాంట్‌ను నిర్మిస్తోంది. వచ్చే ఏడాది జూన్ నాటికి 270 మెగావాట్ల ప్లాంట్ తొలి దశ నిర్మాణం పూర్తి కానుంది. పర్యావరణ సంబంధ అనుమతుల్లో జాప్యం వల్ల ఈ ప్లాంట్ తొలి దశ నిర్మాణం మందగించింది. కాని అనుమతులు వచ్చిన వెంటనే ప్లాంట్ నిర్మాణం పనులు వేగంగా కొనసాగుతున్నట్లు తెలంగాణ జెన్కో వర్గాలు తెలిపాయి. ఈ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైతే, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, భవనగిరి, నల్లగొండ జిల్లాల్లో విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా ఉంటుంది. యాదాద్రి థర్మల్ ప్లాంట్ 4వేల మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం పనులు కూడా వేగవంతమైనట్లు జెన్కో అధికారులు తెలిపారు. నల్లగొండ జిల్లా దామరచర్ల వద్ద ఈ ప్లాంట్‌ను నిర్మిస్తున్నారు. బిహెచ్‌ఇఎల్‌కు ఈ ప్లాంట్ నిర్మాణం బాధ్యతలు అప్పగించారు. యాదాద్రి ప్లాంట్‌కు కూడా అనుమతులు త్వరలో లభించనున్నాయి. 2021 నాటికి ఈ ప్లాంట్ పూర్తి నిర్మాణం పనులు పూర్తవుతాయని జెన్కో అధికారులు తెలిపారు.