రాష్ట్రీయం

‘లైన్’మారితే 954 కోట్ల ఆదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 15: భద్రాచలం రోడ్డు నుండి కొవ్వూరు, సత్తుపల్లి, కొండపల్లి ప్రాంతాలకు రైల్వై లైన్ వేసేందుకు గతంలో రూపొందించిన మూడు ప్రతిపాదనల్లో స్వల్పమార్పులు చేర్పులు చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 954 కోట్ల రూపాయలు ఆదా అవుతాయని రాష్ట్ర ఆర్ అండ్ బి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. సచివాలయంలో బుధవారం రైల్వేలైన్ల తీరుతెన్నులపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడు రైల్వైలైన్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. భద్రాచలం రోడ్డు నుండి కొవ్వూరు, భద్రాచలం రోడ్డు నుండి సత్తుపల్లి, భద్రాచలం రోడ్డు నుండి కొండపల్లి పట్టణాలను కలుపుతూ అప్పట్లో మూడు ప్రతిపాదనలకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఆమోదం తెలిపాయి. ఈ మూడులైన్లలో తుమ్మల నాగేశ్వరరావు చేసిన సూచనల ప్రకారం భదాచలం రోడ్డు నుండి పెనుబల్లి స్టేషన్ వరకు కామన్ అలైన్‌మెంట్ తీసుకోవాలి. దాని వల్ల 44.93 కిలోమీటర్ల నిడివి తగ్గుతుంది. అలాగే సత్తుపల్లి నుండి జీలుగుమిల్లి మధ్య 30 కిలోమీటర్ల మేరకు రైల్వేలైన్ వేస్తే మొదటి ప్రతిపాదన అయిన భద్రాచలంరోడ్డు-కొవ్వూరు మధ్య నిడివి 53 కిలోమీటర్లు తగ్గుతుంది. కేంద్ర ప్రభుత్వం గతంలో ఆమోదించిన ప్రతిపాదనల ప్రకారం రైల్వేలైన్‌ను అటవీభూముల మీదుగా వేయాల్సి వస్తుందని, ఇందుకు అటవీశాఖ అనుమతి రావడం కష్టమని తుమ్మల పేర్కొన్నారు. అలైన్‌మెంట్ మార్చడం వల్ల భూసేకరణ ఖర్చు తగ్గడమే కాకుండా రైల్వేలైన్ వేసేందుకు సమయం కూడా తగ్గుతుందని వెల్లడించారు.
ఒకటవ ప్రతిపాదన ప్రకారం భద్రాచలం రోడ్డు-కొవ్వూరు మధ్య 151 కిలోమీటర్ల రైల్వేలైన్ వేసేందుకు 2012-13 ఆర్థిక సంవత్సరంలో 923 కోట్ల రూపాయల ఖర్చుకు ఆమోదం తెలిపింది. ఈ ఖర్చులో సగం రైల్వే శాఖ భరించాలని, మిగతాసగం రాష్ట్ర ప్రభుత్వ భరించాలని నిర్ణయించారు. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ ఖర్చు 2,700 కోట్ల రూపాయలకు పెరుగుతుందని తేల్చారు. ఈ లైన్‌లో 78.50 కిలోమీటర్లు తెలంగాణలో ఉండ గా, 72.40 కిలోమీటర్లు ఎపిలో ఉంది. ఈ కారణంగా మొత్తం ఖర్చులో సగభాగం కేంద్రం భరిస్తే, మిగతా సగభాగాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కిలోమీటర్ల దామాషాగా భరించాల్సి ఉంటుంది.
రెండో ప్రతిపాదన ప్రకారం భద్రాచలం రోడ్డు నుండి సత్తుపల్లి వరకు రైల్వే లైన్ నిర్మాణం చేయాల్సి ఉంటుంది. 53.20 కిలోమీటర్ల నిడివిగల ఈ లైన్‌కు 2012-13 లో 704.31 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనావేశారు. తాజా అంచనాల ప్రకారం ఈ లైన్‌కోసం 958 కోట్ల రూపాయలు వ్యయం అవుతాయి. మైనింగ్ అవసరాల దృష్ట్యా ఈ లైన్ ఖర్చులో భూసేకరణ వ్యయం కేంద్రం భరించాలని, సివిల్ పనులు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సిగ్నలింగ్, ట్రాక్షన్, ఎలక్ట్రికల్ పనులకయ్యే ఖర్చును సింగరేణి కాలరీస్ సంస్థ భరించేందుకు అంగీకరించింది.
మూడో ప్రతిపాదన ప్రకారం 125 కిలోమీటర్ల నిడివిగల భద్రాచలం రోడ్డు-కొండపల్లి రైల్వేరైన్ నిర్మాణానికి 723 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనావేశారు. దీనికి కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. తాజా అంచనాల ప్రకారం ఈ ఖర్చు 2250 కోట్ల రూపాయలు అవుతుంది.
ఈ మూడు లైన్లకు కలిపి గత ప్రతిపాదనల ప్రకారం 329.20 కిలోమీటర్ల రైల్వేలైన్ వేయాల్సి ఉండగా, సవరించిన అంచనాల ప్రకారం 231.27 కిలోమీటర్లు మాత్రమే అవుతుందని తేల్చారు. అంటే మొత్తం 97.93 కిలోమీటర్ల నిడివి గల రైల్వేలైన్ తగ్గుతుంది. తాజా అంచనాల ప్రకారం ఖర్చు 1763 కోట్ల రూపాయలు తగ్గుతుందని తేల్చారు. తెలంగాణ ప్రభుత్వంపై 954 కోట్ల రూపాయలు ఖర్చు తగ్గుతుండగా, ఎపి ప్రభుత్వంపై 809 కోట్ల రూపాయలు తగ్గుతుందని వెల్లడించారు. ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.