రాష్ట్రీయం

మహంతికి పాక్షిక ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 15: వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో రిటైర్డు ఐఎఎస్ అధికారి ఎస్‌ఎన్ మహంతిపై సిబిఐ మోపిన అభియోగాలను హైకోర్టు కొట్టివేసింది. దీంతో మహంతికి పాక్షికంగా ఊరట లభించింది. కేంద్ర ప్రభుత్వం మహంతిని ప్రాసిక్యూషన్‌కు చేసేందుకు సిబిఐకు అనుమతి ఇవ్వకపోయినా, అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలను సిబిఐ దాఖలు చేయడం చెల్లదని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఐపిసి సెక్షన్ల కింద మహంతిపైన సిబిఐ విచారణ చేయవచ్చని కోర్టు పేర్కొంది. ఇందూ గ్రూపుకంపెనీకి హౌసింగ్ బోర్డు చీఫ్‌గా మహంతి ప్రయోజనాలు కల్పించే విధంగా నడుచుకున్నారని సిబిఐ అభియోగం మోపింది. ఈ కేసులో మహంతిని మూడవ నిందితుడిగా సిబిఐ పేర్కొంది. ఇందూ గ్రూపు కంపెనీలకు భూముల కేటాయింపులో మహంతి లబ్ధి పొందారని చెప్పేందుకు సిబిఐ ఎటువంటి ఆధారాలను చూపలేదని కోర్టు పేర్కొంది.