రాష్ట్రీయం

రైళ్లలో భద్రతకు ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 15: రైళ్ల సమయపాలనతోపాటు ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యదవ్ రైల్వే అధికారులకు సూచించారు. బుధవారం సికిందరాబాద్‌లోని రైల్ నిలయంలో ఆరు డివిజన్లకు చెందిన మేనేజర్లు, ముఖ్య విభాగాలకు చెందిన అధికారులతో ఆయన వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో రైల్వే భద్రతపై ప్రధానంగా చర్చించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మైనర్ ఘటనలు తప్ప, ఎలాంటి ప్రమాదాలు జరుగలేదని, ఎక్కడైనా రైల్వే ట్రాక్‌ల పగుళ్లు, సిగ్నల్ ఫెయిల్యుర్, లెవెల్ క్రాసింగ్‌ల వద్ద ప్రమాదమని తెలిస్తే..వెంటనే మరమ్మతులు చేపట్టాలని జిఎం వినోద్‌కుమార్ యాదవ్ అధికారులను అదేశించారు. బొగ్గు రవాణాలో సమయ పాలన పాటించాలని, ప్రయాణికులకు భద్రత కల్పించాలని ఆయన కోరారు. కాపలాలేని గేట్ల వద్ద నిఘా పెట్టాలని, పెండింగ్ పనులను వీలైనంత త్వరిగతిన పూర్తి చేయాలని జీఎం అధికారులను సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు జీఎం జాన్ థామస్, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్ కెవి శివప్రసాద్, ఫైనాన్షియల్ అడ్వయిజర్ పద్మిని రాధాకృష్ణన్‌తోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.