రాష్ట్రీయం

ఉద్యమ నేత ఒక్కరూ లేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, నవంబర్ 16: అధికారం లేకపోయినా తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పోరాడిన వారికే రైతు సమన్వయ సమితుల్లో(ఆర్‌ఎస్‌ఎస్) స్థానం కల్పించామని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించగా ఖమ్మం జిల్లా సమితిలో ఒక్కరు కూడా ఉద్యమ నేత లేకపోవడం గమనార్హం. జిల్లా సమన్వయ సమితుల్లో నాడు తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురొడ్డి పోరాడిన వారినే తీసుకుంటామని స్పష్టంగా చెప్పిన ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లాలో నాటి ఉద్యమనేతలు ఒక్కరు కూడా లేరనే విషయాన్ని గమనించలేదు. జిల్లా సమన్వయ సమితిలో 25మందిని నియమించాల్సి ఉండగా ఇప్పటికే ప్రతిపాదించిన జాబితాలో ఉద్యమ టీఆర్‌ఎస్ నేతలు ఒక్కరూ లేరు. టీడీపీ నుంచి వలస వచ్చిన వారు 13మంది, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన వారు వారు ఐదుగురు, కాంగ్రెస్ నుంచి చేరిన వారు ముగ్గురు, సీపీఎం నుంచి వచ్చి చేరిన వారు ముగ్గురు, సీపీఐ నుంచి వచ్చినవారు ఒకరు ఉన్నారు. జిల్లా కమిటీలో ప్రభుత్వ పెద్దలు ప్రతిపాదించిన జాబితాలో ఒక్కరు కూడా నాడు ఉద్యమంలో పనిచేసిన వారు లేకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా సమన్వయ సమితుల్లో సగంమందికి పైగా పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారే ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం వలస పక్షులకే అధిక ప్రాధాన్యమిస్తున్నదని వస్తున్న ప్రచారానికి ఈ నియామకాలు, ముఖ్యమంత్రి ప్రకటన మరింత ప్రాధాన్యతను కల్పిస్తున్నాయి. నాడు ఉద్యమంలో ప్రభుత్వానికి ఎదురొడ్డి పోరాడిన నేతల కంటే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల అనుచరులకే సమన్వయ సమితుల్లో అధిక ప్రాధాన్యమిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి ఖమ్మం జిల్లాలో ఆ పార్టీ ప్రతిపాదించిన జాబితాను ఉదాహరణగా చెబుతున్నారు. ఇప్పటికే పలు కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ పదవుల్లో వలసవాదులకు ప్రాధాన్యతనిచ్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం రైతు సమన్వయ సమితులతో మరింత ఇరకాటంలో పడనున్నది. కొత్తగూడెం జిల్లాలో కూడా పూర్తిగా ఇదే పరిస్థితి నెలకొన్నది. ఉద్యమంలో కీలకంగా పనిచేసిన నేతల్లో ఒకరిద్దరు మినహా ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల పరిధిలో నేతలు కన్పించడం లేదు. వారంతా రాజకీయాల్లో వెనుకబడగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు అధికారం చెలాయిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్నాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తమ ప్రాంతాల్లో పట్టు బిగించేందుకు వలసవాదులు ఇప్పటి నుంచే ప్రయత్నిస్తున్నట్లు బహిరంగంగానే విమర్శలు వస్తున్నాయి.