రాష్ట్రీయం

పర్యావరణ హితమే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 16: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యావరణ హితంగా ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేసేందుకు ఉన్న అవకాశాలను అనే్వషించి అధ్యయనం చేయడానికి టయోటా కిర్లోస్కర్ మోటార్ సంస్థతో అవగాహన ఒప్పందం చేసుకుంటున్నట్టు రాష్ట్ర ఐటి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. గురువారం విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపుకార్యాలయంలో రాష్ట్ర ఐటి కమ్యూనికేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.విజయానంద్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ సీఈవో సిహెచ్ తిరుమలరావు,టయోటా కిర్లోస్కర్ మోటార్ ఎండీ అకిటో తచిబానా మధ్య మంత్రి సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా మాట్లాడిన లోకేష్ ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికతో రియల్ టైమ్ గవర్నెన్స్ విధానంలో, రాష్ట్రంలో ప్లగ్ ఇన్ హైబ్రిడ్-ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేస్తామన్నారు. పర్యావరణ హిత విధానంలో కాలుష్య సమస్యను పరిష్కరించడానికి పరస్పర సహకారంతో టయోటా సంస్థ - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి పనిచేయడానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు. నగరంలో అంతర్గతంగా, ఇతర నగరాలతో అనుసంధానంగా రహదారి మార్గాల్లో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఆదర్శంగా నిలిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ వాహనాల విషయంలో ప్రఖ్యాతిగాంచిన టయోటా సంస్థ నుంచి 20 సంవత్సరాల క్రితమే వచ్చిన విద్యుత్ కారు ‘ప్రియాస్’ ఎంతో ఖ్యాతి గడించిందన్నారు. విద్యుత్ వాహనాల రంగంలో హైబ్రిడ్ వాహనాలకు అంతర్జాతీయంగా టయోటా ప్రసిద్ధి చెందిందన్నారు.
డిసెంబర్, జనవరి నెలల్లో ప్రయోగాత్మకంగా మన ప్రాంతంలో వినియోగించడం కోసం ఎలక్ట్రిక్ వాహన బస్సులను టయోటా సంస్థ ఉచితంగా అందించనుందన్నారు. వీటిని అమరావతి పరిధిలోని సెక్రటేరియట్, సీఆర్‌డిఏ, తిరుమల కొండపైకి నిర్వహిస్తామన్నారు. ఉప ప్రణాళిక కింద తొలుత రాష్ట్రంలోని వౌలిక వసతులు, ఛార్జింగ్ స్టేషన్ పాయింట్లు ఏర్పాటు చేయాలనే దిశలో ప్రాంతాల గుర్తింపు అవగాహన ఒప్పందంలో భాగంగా చేపడతామన్నారు. 2018 మే నెల నుండి డిసెంబర్ నెల వరకు పూర్తిస్థాయిలో స్మార్ట్ నగరం అమరావతి పరిధిలో విద్యుత్ వాహనాలను పరిచయం చేసే అవకాశాలను అనే్వషించడానికి ఆ సంస్థ ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందానికి రావడం శుభపరిణామమన్నారు. తద్వారా ఈ భాగస్వామ్యంతో పరిశుభ్రమైన, ఆకుపచ్చ పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి లక్ష్యం నెరవేరుతుందనే నమ్మకం ఉందన్నారు. ఎలక్ట్రిక్ వాహనం ఒకసారి ఛార్జి చేస్తే 70 కిలోమీటర్లు పనిచేస్తుందని, స్పీడు ఛార్జింగ్ విధానంలో 80 శాతం ఛార్జింగ్ ప్రక్రియను 20 నిముషాల్లో చేసుకోవచ్చన్నారు. దేశంలోనే ప్రథమంగా ఇటువంటి ఒప్పందం చేసుకున్న తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోందన్నారు. విద్యుత్ వాహనాలను మరింతగా వినియోగంలోకి తెచ్చేందుకు ఈసీఐఎల్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా రాబోయే రోజుల్లో 15 వందల వాహనాలను సరఫరా చేయాలని కోరామన్నారు. అదే విధంగా ఈ రంగంలో విశేషంగా కృషి చేస్తున్న రవాణా సంస్థలు ఓబర్, ఓల్వా వంటి సంస్థలతో కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయడంపై కృషి చేస్తామన్నారు. టయోటా కిర్లోస్కర్ మోటార్ మేనేజింగ్ డైరక్టర్
అకిటో తచిబానా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన అమరావతి స్మార్ట్ సిటీ నిర్మాణంలో విద్యుత్ వాహనాల ప్రియస్ పీహెచ్‌ఈవీ, స్టాల్ ఈవీ కమ్యూటర్‌ను పరిచయం చేసేందుకు అవకాశం కల్పించి సహకారం అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. దేశంలో వేధిస్తున్న కాలుష్య సమస్యను విద్యుత్ వాహనాల వినియోగం ద్వారా పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం కృషిని, ప్రయత్నాలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు. బాధ్యతా యుతమైన వాహన తయారీదారులుగా ఇంధన భధ్రత, కార్బన్‌డైఆక్సైడ్ సమస్యలను పరిష్కరించడానికి తమపై అతి పెద్ద బాధ్యతను ఉంచారని, దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తామనే విశ్వాసం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మార్గనిర్ధేశాలకు అనుగుణంగా దేశంలో పెరుగుతున్న కాలుష్యం, ఇంధన దిగుబడుల సమస్యలను అధిగమించేందుకు, అత్యుత్తమ సాంకేతికతను జోడించి విద్యుత్ వాహనాలను ఈ ప్రాంతానికి అనుగుణంగా తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు.

చిత్రం..మంత్రి లోకేశ్ సమక్షంలో టయోటా కిర్లోస్కర్ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకుంటున్న దృశ్యం