రాష్ట్రీయం

వ్యవసాయానికే అధిక ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 16: పరిశ్రమల కన్నా వ్యవసాయానికే అధిక ప్రాధాన్య ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇక ప్రతి సోమవారం వ్యవసాయంపై సమీక్ష జరుపుతామని, లోవా యూనివర్శిటీ సహకారంతో మెగా సీడ్ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. నాణ్యమైన విత్తనాలతో అధిక ఉత్పత్తులను సాధిస్తే వ్యవసాయ రంగం సుస్థిరంగా ఉంటుందన్నారు. 40 లక్షల ఎకరాల్లో ఉద్యాన వన పంటలు పండుతున్నాయని, వీటిని కోటి ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లను అందుబాటులోకి తీసుకువచ్చి కోటి ఎకరాలను సస్యశ్యామలం చేస్తామని చంద్రబాబు చెప్పారు.
వైద్య ఆరోగ్య శాఖలో 12 సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నాయని, అలాగే వ్యవసాయ శాఖలో కూడా సర్వీస్ ప్రొవైడర్స్‌ను తయారు చేస్తామని తెలియచేశారు. వ్యవసాయ విప్లవంలో డ్రోన్, అనలటిక్స్, బిగ్ డేటా, డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రముఖ పాత్ర పోషించనున్నాయని ఆయన తెలియచేశారు. రైతులకు, కౌలుదార్లకు అవసరమైనప్పుడు రుణాలు అందేలా చూస్తామని చంద్రబాబు చెప్పారు. వ్యవసాయాధారిత పరిశ్రమల యజమానులుగా రైతులు మారితే వారు ఆర్థికంగా బలపడతారని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు పాడైపోకుండా ఉండేందుకు కావల్సిన గోడౌన్‌లు, కోల్డ్ స్టోరేజ్‌లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలన్న విషయమై ఇటీవల జరిగిన క్యాబినెట్‌లో చర్చించామని, దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ తయారు చేయాలని ఆదేశించానని చంద్రబాబు చెప్పారు.

చిత్రం..కేంద్ర మంత్రికి జ్ఞాపికను అందజేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు