రాష్ట్రీయం

అగ్రగామి భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 16: ‘వ్యవసాయ రంగంలో సంస్కరణలకు అంకురార్పణ జరిగింది. మరో పాతికేళ్లలో వీటి ఫలితాలను మనం చూడగలుతాం. అప్పటికి అభివృద్ధి చెందిన దేశాలకన్నా భారత్ వ్యవసాయరంగంలో అగ్రగామిగా నిలుస్తుంద’ని కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు. ఇక్కడ ‘ఏపి అగ్రిటెక్ సమ్మిట్-2017’ రెండో రోజు గురువారం జరిగిన సమావేశంలో ఆయన కీలక ఉపన్యాసం చేశారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న ప్రధాని మోదీ లక్ష్యానికి అనుగుణంగా చంద్రబాబు తొలి అడుగు వేశారని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి, వ్యవసాయ ఉత్పత్తులను పెంచాలన్న ఆలోచన చాలా గొప్పదని అన్నారు. పంటలకు సోకే తెగుళ్లను ఎలా అరికట్టాలో సూచించేందుకు ఏపి ప్రభుత్వం ఒక యాప్‌ను తయారు చేయడం ముదావహమన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో పంటలు పండించేందుకు ఏపిలో రెయిన్ గన్స్ వాడకం తనను ఎంతగానో అకట్టుకుందని అన్నారు. వ్యవసాయ, మత్స్య పరిశ్రమ రంగాల్లో భారత్ రికార్డులు సృష్టిస్తోందని, 65 వేల కోట్ల సీఫుడ్స్ ఉత్పత్తి అవుతున్నాయని, ఇందులో 45 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచి జరుగుతున్నాయని చెప్పారు. 2030 నాటికి ఆహార అవసరాలను ఇప్పటి నుంచి గుర్తించి, ఆ దిశగా ఉత్పత్తులను పెంచాలని ఆయన సూచించారు. దేశంలో క్రిమి సంహారక ఎరువుల వినియోగం తగ్గిందని చెప్పడానికి యూరియా డిమాండ్ 12 శాతం తగ్గడమే ఒక ఉదాహరణ అని ఆయన అన్నారు. వ్యవసాయ రంగంలో సవాళ్లకు కొత్త పరిష్కార మార్గాలను అనే్వషించాలని షెకావత్ విజ్ఞప్తి చేశారు. అనంతరం అగ్రిటెక్ సదస్సులో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను షెకావత్ తిలకించారు.