రాష్ట్రీయం

రాష్ట్రంలో ఎన్ని పులులున్నాయి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: పులుల మనుగడతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని, వాటి రక్షణకు తగిన చర్యలు తీసుకుంటూనే అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించవచ్చని జాతీయ పులుల సంరక్షణ విభాగం (దక్షిణాది) ఐజి పిఎస్ సోమశేఖర్ అన్నారు. జనవరి నుంచి దేశ వ్యాప్తంగా పులుల గణన మొదలు కాబోతోందని, అదే తెలంగాణ రాష్ట్ర స్థాయిలో తొలిసారి పులుల గణన అవుతుందని అన్నారు. గురువారం నాడిక్కడ దూలపల్లిలోని అటవీశాఖ అధికారుల వర్క్‌షాప్‌లో సోమశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పులుల జనాభా లెక్కింపునకు అవసరమైన మానవ సాంకేతిక నైపుణ్యం, అడవిలో వ్యవహరించాల్సిన తీరుపై ఆయన తెలంగాణ అటవీ అధికారులకు ప్రజంటేషన్ ఇచ్చారు. పర్యావరణ సమతుల్యత పరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ
దేశ వ్యాప్తంగా ఏటా ఆరుశాతం చొప్పున పులుల సంఖ్య పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయని తెలిపారు. తెలంగాణలో ఉన్న కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వులు పులుల సంచారానికి అనువుగా ఉన్నాయని ఈసారి జరిగే లెక్కింపులో వాటి ఉనికిపై స్పష్టత వస్తుందని అన్నారు. ఈసారి వన్యమృగ లెక్కింపు దశలవారీగా ఎలా జరుగుతుంది, క్షేత్రస్థాయి సిబ్బంది ఎలా వివరాలు సేకరించాలి, అందుబాటులో ఉన్న సాంకేతికతలపై ఆయన వివరించారు. డిసెంబర్ మొదటి వారంలో కర్ణాటక బందీపూర్ అటవీ ప్రాంతంలో దక్షిణాది రాష్ట్రాల అధికారులకు మూడు రోజుల శిక్షణ ఉంటుందని, తెలంగాణ తరఫున అధికారులు హాజరు కావాలని ఆయన ఆహ్వానించారు. ఈ వర్క్‌షాప్‌లో పులుల సంరక్షణ విభాగం అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ డాక్టర్ రాజేంద్ర, అటవీ సంరక్షణ ప్రధానాధికారి పికె ఝూ, వైల్డ్ లైఫ్ ప్రధానాధికారి డాక్టర్ మనోరంజన్ భాంజా, దూలపల్లి అటవీ అకాడమీ డైరక్టర్ కోట తిరుపతయ్య, అన్ని జిల్లాల అటవీ అధికారులు హాజరయ్యారు.