రాష్ట్రీయం

త్వరలోనే ధార్మిక పరిషత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: తెలంగాణ ధార్మిక పరిషత్‌ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని రాష్ట్ర దేవాదాయ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి హామీ ఇచ్చారు. అర్చకులు, ఆలయ ఉద్యోగులకు వేతనాల పెంపునకు సంబంధించి దేవాదాయ, ధర్మాదాయ చట్టంలో చేసిన సవరణల బిల్లుపై శాసనసభలో గురువారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేవాదాయ శాఖ పరిపాలన సజావుగా సాగేందుకు ధార్మికపరిషత్‌ను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఎండోమెంట్స్ శాఖ అధీనంలోని దేవాలయ అర్చకులు, ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఇస్తున్న విధంగానే ప్రతినెలా ఒకటోతేదీకి అర్చకులు, ఆలయ ఉద్యోగులకు వేతనాలు చెల్లించే ఏర్పాటు చేశామన్నారు. ఇందుకోసం గ్రాంట్-ఇన్-ఎయిడ్ కింద ప్రభుత్వం 50 కోట్ల రూపాయలు ఇస్తోందన్నారు. దూపదీప నైవేద్యం (డిడిఎన్) పథకం కింద ప్రస్తుతం 1805 దేవాయాలకు ఆర్థిక సాయం చేస్తున్నామని, అర్చకులకు ఇచ్చే పారితోషికాన్ని ఆరువేల రూపాయలకు పెంచామన్నారు. ప్రస్తుతం ఈ పథకంలో ఉన్న 1805 దేవాలయాలతో పాటు మరో 3000 దేవాలయాలకు ఈ సౌకర్యం వర్తింపచేస్తామన్నారు. దేవాదాయ, దర్మాదాయ చట్టసవరణ బిల్లుకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
లోకాయుక్త నియామకానికి కమిటీ
లోకాయుక్త, ఉపలోకాయుక్త నియామకాలకోసం ఉన్నతస్థాయి కమిటీని నియమించేందుకు వీలుగా ప్రస్తుత లోకాయుక్త చట్టంలో మార్పులు చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి తరఫున రోడ్లుభవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రవేశపెట్టిన బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. కొత్త చట్టంప్రకారం ఈ కమిటీలో
ముఖ్యమంత్రి, స్పీకర్, శాసనసభలో ప్రతిపక్ష నాయకులు, శాసనమండలి చైర్మన్, శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడిని సభ్యులుగా నియమించేందుకు ఈ చట్టం వీలుకల్పిస్తోంది. లోకాయుక్త, ఉపలోకాయుక్త పదవులకు ఒక పర్యాయం ఎంపికైన వారిని తిరిగి నియించేందుకు కూడా ఈ చట్టంలో సవరణలు చేశారు. ప్రస్తుతం అమల్లోఉన్న చట్టం ప్రకారం అవినీతికి పాల్పడ్డవారిని మాత్రమే శిక్షించేందుకు లోకాయుక్త, ఉపలోకాయుక్తలకు అధికారం ఉండేదని, ఇక నుండి విధులు సక్రమంగా నిర్వర్తించని వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం కలిగిందని మంత్రి వివరించారు.