రాష్ట్రీయం

రెండో అధికార భాష ఉర్దూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: తెలంగాణ రాష్ట్రంలో ఉర్దూను ద్వితీయ అధికార భాషగా గుర్తిస్తూ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లుకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. తెలంగాణ అధికార భాష చట్టానికి సవరణ చేస్తూ, ప్రతిపాదించిన బిల్లును ముఖ్యమంత్రి తరఫున రోడ్లు, భవనాల మంత్రి తుమ్మలనాగేశ్వరరావు సభలో ప్రవేశపెట్టారు. సభ్యులు చేసిన సూచనల తర్వాత ఈ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ, త్వరలోనే ఉర్దూఅకాడమిని పునరుద్దరిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పక్షం ఉపనాయకుడు టి. జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలోని పాత తొమ్మిది జిల్లాల్లో తొమ్మిది జిల్లాల్లో ఉర్దూను రెండో అధికార భాషగా గుర్తించి, చట్టం చేశామన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం జిల్లా (పాత జిల్లా) పరిధిని ఈ చట్టంలో చేర్చడం వల్ల తెలంగాణ రాష్ట్రం మొత్తంలో తెలుగు భాష తర్వాత ఉర్దూకు రెండో అధికార భాషగా గుర్తింపు లభించింది. ఇది టిఆర్‌ఎస్ గొప్పదమేమీ కాదని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. కేవలం ఒకే ఒక జిల్లాలో మాత్రమే ఉర్దూను అధికార భాషగా గుర్తిస్తూ చట్టసవరణ చేస్తున్నారని వివరించారు.
ఇలా ఉండగా ఉర్దూను రెండో అధికార భాషగా గుర్తిస్తూ కాంగ్రెస్ చట్టం చేసినప్పటికీ, దాన్ని అమల్లోకి తీసుకురాలేదని శాసనసభా వ్యవహారాల మంత్రి టి. హరీశ్‌రావు ఆరోపించారు. తమ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉర్దూకు గౌరవం కల్పిస్తూ, గవర్నర్, శాసనమండలి, శాసనసభ, ముఖ్యమంత్రి,
మంత్రులు, సచివాలయం, జిల్లా కలెక్టరేట్లలో ఉర్దూ ట్రాన్స్‌లేటర్లను నియమిస్తున్నామని పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలను వచ్చే నెలలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న సందర్భంగా తెలుగుపై ఒకరోజు సభలో చర్చ జరపాలని బిజెపి పక్షం నాయకుడు జి. కిషన్‌రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. తెలుగుభాషను పటిష్టం చేసేందుకు దిక్కులేదని, ఈ పరిస్థితిలో ఉర్దూకు ఎలాంటి గౌరవం ఇస్తారో అంటూ వాపోయారు. ఇంత కాలమైనా జీఓలు నేటికీ ఇంగ్లీషులోనే వస్తున్నాయని గుర్తు చేశారు. పొరుగురాష్ట్రాలైన తమళనాడు, కేరళ, కర్నాటక, మహారాష్టల్రు వారి వారి మాతృభాషలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు.
ఉర్దూను ద్వితీయ అధికార భాషగా గుర్తిస్తూ చట్టం చేయడం హర్షణీయమని ఎంఐఎం పక్షం నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ ఈ సందర్భంగా శ్లాఘించారు. ఉర్దూకు ముఖ్యమంత్రి కెసిఆర్ అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.