రాష్ట్రీయం

పెద్దశేష వాహనంపై పద్మావతీదేవి దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 16: తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన గురువారం ఉదయం అమ్మవారు శ్రీమన్నారాయణుడి అవతారంలో పెద్దశేష వాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందుభాగాన అశ్వాలు, వృషభాలు, గజరాజులు ఠీవిగా ముందుకు కదులుతుంటే మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్క్భజనల నడుమ అమ్మ వారు ఆలయ నాలుగు మాడవీధుల్లో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. అడుగడుగునా భక్తులు నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. శ్రీలక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా, సఖుడిగా, శయ్యగా, సింహాసనంగా, ఛత్రంగా సమయోచితంగా సేవలందిస్తాడు. సర్పరాజైన శేషుని వాహన సేవలను తిలకించిన వారికి యోగశక్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారు గురువారం రాత్రి 8 నుంచి 10 గంటల వరకు హంస వాహనంపై చతుర్మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. భారతీయ సంస్కృతిలో అనాదిగా మహావిజ్ఞాన సంపన్నులైన మహాత్ములను, యోగి పుంగవులను పరమహంసలుగా పేర్కొనడం గమనార్హం. యోగి పుంగవులు జ్ఞానం, అజ్ఞానం తెలిసి మెలుగుతారు. అట్టి మహాయోగి పుంగవుల హృదయాలలో జ్ఞాన స్వరూపిణియైన అలమేల్‌మంగ విహరిస్తూ ఉంటుందని నమ్మకం. జ్ఞానార్జనకై సరస్వతీదేవిని ఉపాసించే సాధుకులు ‘‘ హంస వాహన సంయుక్తా విద్యాదానకరీ మమ’’ అని ఆ తల్లిని ఆరాధిస్తారు.