రాష్ట్రీయం

సింగరేణిలో కొత్తగా మరో 12 గనులు: సీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 17: సింగరేణిలో త్వరలోనే 12 కొత్త గనులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. శాసనసభ ప్రశ్నోత్తర కార్యక్రమంలో సోమారపు సత్యనారాయణ, పుట్టా మధుకర్, దుర్గం చిన్నయ్య తదితరులు అడిగిన ప్రశ్నలకు సిఎం బదులిస్తూ సింగరేణి కాలరీస్‌లో నూతన బొగ్గు గనుల ఏర్పాటుపై వివరణ ఇచ్చారు. 12 గనుల్లో ఆరు భూగర్భ గనులు, ఆరు ఉపరితల గనులు ఉన్నాయని అన్నారు. గనుల తవ్వకంలోనూ, ఏర్పాటు చేసిన వౌలిక సదుపాయాల్లో ఉన్న విస్తార అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ లోపల, వెలుపల ఇతర రంగాల్లో గనుల తవ్వకాల అవకాశాలను పరిశీలిస్తోందని అన్నారు. సింగరేణిలో నైపుణ్యాభివృద్ధికి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కేంద్రాలను మూడు చోట్ల పెట్టేందుకు ప్రణాళికలు చేస్తున్నామని అన్నారు. సింగరేణిలో 12వేల ఉద్యోగాలను కల్పిస్తున్నామని సిఎం అన్నారు. ఇప్పటికే కొంత మందిని రిక్రూట్‌చేశామని వెల్లడించారు. సింగరేణి కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామని అన్నారు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి, ప్రేలుడు పదార్థాల తయారీ, ప్రాసెస్డ్ ఓవర్ బర్డెన్‌గా వివిధ రీతుల్లో విస్తరించిందని దీంతో పాటు రామగుండం వద్ద 50 ఎండబ్ల్యు సౌర విద్యుత్ ప్లాంట్‌ను నిర్మించాలని యోచిస్తోందని చెప్పారు.