రాష్ట్రీయం

సాగు మేల్ తలపెట్టవోయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 17: ‘ఐటీ, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో 20 ఏళ్లుగా మీతో కలిసి చేసిన ప్రయాణం వాస్తవ రూపం దాల్చింది. మరో ఏడాదిపాటు ఈ ప్రయాణాన్ని మరింత వేగంగా కొనసాగిస్తే అద్భుతాలు సాధించవచ్చు..’ అని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ అన్నారు. ‘ఏపీ అగ్రిటెక్ సమ్మిట్-2017’ ముగింపు సమావేశంలో ముఖ్య అతిథిగా మాట్లాడుతూ, ఆంధ్ర భవిష్యత్ రైతులపైనే ఆధారపడి ఉందన్నారు.
వ్యవసాయం, థాని అనుబంధ రంగాలను అభివృద్ధి చేయాలన్న చంద్రబాబు ఆలోచన సరైనదని బిల్ కితాబు ఇచ్చారు. మెగాసీడ్ పార్క్ ఏర్పాటుతో ఇక్కడ సాగురంగం దశ మారబోతోందని, రైతుల అవసరాలను ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు గుర్తించాలన్నారు. చిన్న తరహా రైతులు పోస్ట్‌హార్వెస్ సమస్యలను ఎదుర్కొంటున్నారని, దాన్ని పరిష్కరించగలితే వారు ఆర్థికంగా నిలదొక్కుకోగలుతారన్నారు. చిన్న రైతుల ఉత్పాదక శక్తిని పెంచడంతోపాటు, వారికి మార్కెట్ సదుపాయాన్ని కల్పించాలని బిల్‌గేట్స్ సూచించారు. పోషక విలువలతో కూడిన వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ రంగంలో పరిశోధనలు మందగించాయని, శాస్తవ్రేత్తలు కనుగొన్న కొత్త విషయాలు క్షేత్రస్థాయికి చేరడానికి చాలా సమయం పడుతోందని, దీంతో పరిశోధనా ఫలాలు రైతులకు చేరడం లేదన్నారు.
కొత్త వంగడాలను వినియోగించాలి
దశాబ్దాల కాలం నాటి వరి వంగడాలను ఇప్పటికీ ఇక్కడ వినియోగిస్తున్నారని, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కొత్తరకాలను ఎంపిక చేసుకోవాలని బిల్‌గేట్స్ అన్నారు. మనీలాలో ఎప్పటికప్పుడు కొత్త వరి వంగడాలు తయారవుతున్నాయని, 14 నుంచి 20 వారాల్లోనే పంట చేతికి వస్తుందని చెప్పారు. యానిమల్ బ్రీడింగ్‌లో జాగ్రత్తలు తీసుకుంటే, పాలిచ్చే ఆవుల సంతతి పెరుగుతుందన్నారు. ప్రతి రైతు తాను నాటే విత్తనంపై అవగాహన పెంచుకోవాలని, మార్కెట్‌లో ఏ పంటకు డిమాండ్ ఉందో తెలుసుకోవాలన్నారు. ఈ దిశగా ప్రభుత్వాలు
చొరవ చూపితే వ్యవసాయం లాభసాటిగా మారుతుందన్నారు. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించేందుకు ఏపీ ప్రభుత్వం సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకుందని బిల్‌గేట్స్ అభినందించారు.
ఎరువుల వాడకాన్ని తగ్గించాలి
సారవంతమైన భూములను గుర్తించి ఎరువుల వినియోగాన్ని బాగా తగ్గించాలని బిల్‌గేట్స్ సూచించారు. డ్రోన్‌ల సహకారంతో భూసార పరీక్షలు చేస్తే, 100 డాలర్లకు బదులు ఒక్క డాలరు ఖర్చు చేస్తే సరిపోతుందని అన్నారు. దీని వల్ల రైతులకు, రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుందని ఆయన వివరించారు.
ఆధునిక పద్ధతులే శరణ్యం
భారత్‌లో అత్యధిక శాతం ప్రజలకు జీవనోపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగాన్ని ఆధునిక విధానాలతో అభివృద్ధి చేయాలని, తద్వారా రైతులు ఆర్థిక స్వావలంబన సాధిస్తారని బిల్‌గేట్స్ అన్నారు. వారి ఆదాయం పెరగడం ద్వారా జీపీడీ వృద్ధి సాధిస్తుంది. పౌష్టికాహార సమస్య పరిష్కరించగలితే, పేదరికం తగ్గుతుందన్నారు.
మహిళల భాగస్వామ్యం పెంచాలి
వ్యవసాయ రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని బిల్‌గేట్స్ సూచించారు. జెబికాలో మహిళా సంఘాలను ఏర్పాటు చేసి, వారితో వ్యవసాయం చేయించగా, వారు 10 శాతం అధిక ఉత్పత్తిని సాధించారని, ఆన్‌లైన్ ద్వారానే నగదు చెల్లించామని చెప్పారు. వ్యవసాయ రంగంలో మహిళలు రాణిస్తే ఉత్పత్తిలో 20 నుంచి 30 శాతం వృద్ధి సాధించవచ్చని చెప్పారు.

చిత్రం..బిల్‌గేట్స్‌ను సత్కరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు