రాష్ట్రీయం

పాదయాత్రకు మళ్లీ బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 17: అక్రమాస్తుల కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆంధ్ర అసెంబ్లీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఇక్కడ సిబిఐ కోర్టు విచారణకు హాజరయ్యారు. జగన్‌తోపాటు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కోర్టుకు హాజరయ్యారు. జగన్ ఈనెల 6న కడప జిల్లా ఇడుపులపాయలో పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. పాదయాత్ర చేపట్టినందువల్ల కోర్టు విచారణకు హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సిబిఐ కోర్టు కొట్టివేసింది. దీంతో ఈనెల 10న కూడా కోర్టు విచారణకు జగన్ హాజరయ్యారు. రాంకీ సిమెంట్ సంస్ధలో తమకు ప్రత్యక్షంగా, పరోక్షంగా పెట్టుబడులు లేవని జగన్, విజయసాయిరెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈనెల 24కి కోర్టు ఈ కేసు విచారణను వాయిదా వేసింది. కోర్టుకు హాజరైన అనంతరం సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరిన జగన్ కర్నూలు జిల్లా బనగానపల్లికి పాదయాత్ర నిమిత్తం వెళ్లారు.