రాష్ట్రీయం

ముస్లిం కోటా పెంపు సాధ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 17: ముస్లిం మైనార్టీలకు ప్రస్తుతం విద్యా, ఉద్యోగాలలో అమలు చేస్తున్న రిజర్వేషన్ల శాతాన్ని మరింత పెంచాలనుకుంటున్న తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. తాజాగా రాజస్తాన్ ప్రభుత్వం అక్కడ గుజ్జర్ల ఆందోళన నేపథ్యంలో బీసీలకు అమలు చేస్తున్న రిజర్వేషన్లను 21 నుంచి 26 శాతానికి పెంచింది. దీంతో ఆ రాష్ట్రంలో రిజర్వేషన్ల కోటా 49 నుంచి 54 శాతానికి చేరింది. దీంతో రిజర్వేషన్లు 50 శాతానికి మించడాన్ని రాజస్తాన్‌లో తెగేసి చెప్పిన సుప్రీం కోర్టు, తెలంగాణ ప్రభుత్వానికి ఏవిధంగా అనుమతి ఇస్తుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు అమలు జరుగుతుండగా వీటిని 12 శాతానికి పెంచాలని తెరాస ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. తమిళనాడు తరహాలో.. రిజర్వేషన్లు పెంచాలనుకునే వర్గాలను 9వ షెడ్యూల్‌లో చేర్చి తద్వారా అమలు చేయడం సాధ్యమేనని తెలంగాణ ప్రభుత్వం వాదన. అయితే ఇక్కడో తిరక్కాసు వల్ల రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాకపోవచ్చన్న వాదనా వినిపిస్తోంది. రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్రాలకు కల్పిస్తూనే ఇది 50 శాతానికి మించకూడదన్న నిబంధనను సుప్రీంకోర్టు తు.చ తప్పకుండా పాటించాలని సూచిస్తుంది. రాజస్తాన్ ప్రభుత్వం గుజ్జర్ల కోసం బీసీ కోటాలో 5 శాతం రిజర్వేషన్లను పెంచుతూ అక్కడి ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును తిరస్కరించకుండానే రిజర్వేషన్ల పెంపునకు అంగీకరించలేదు. ఈ లెక్కన తెలంగాణ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు ఎంత శాతం పెంచినా అభ్యంతరం చెప్పకుండానే 50 శాతం కోటా మించకూడదన్న మెలికపెట్టే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా సిఎం కె చంద్రశేఖర్‌రావు తమిళనాడులో
అమలు జరుగుతున్న తరహాలో అమలు చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరింత లోతుగా విశే్లషిస్తే తమిళనాడులో 50 శాతానికి మించిన రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. తుది తీర్పునకు లోబడే తమిళనాడులో పెంచిన రిజర్వేషన్లపై భవితవ్యం ఆధారపడి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వానికి కూడా తమిళనాడు తరహాలో తుది తీర్పునకు లోబడి అమలు చేసుకునే వెసులుబాటు లభించవచ్చు కానీ పెరిగే రిజర్వేషన్లు శాశ్వతంగా అమలు చేస్తామన్న గ్యారంటీ లేదు. తెలంగాణలో రిజర్వేషన్ల పెంపు అంశంపై పలువురు న్యాయ నిపుణులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.
రాజ్యాంగం అంగీకరించదు: రామచంద్రరావు
తమిళనాడు తరహాలో రిజర్వేషన్ల పెంపుదలను 9వ షెడ్యూల్‌లో చేర్చినా రాజ్యాంగం అంగీకరించదు. తమిళనాడులో రిజర్వేషన్లను 69 శాతానికి పెంచిన అంశం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. సుప్రీం కోర్టు ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండరాదని వివిధ తీర్పుల ద్వారా చెబుతూ వస్తూంది. తాజాగా రాజస్తాన్‌లో ఓబిసిల రిజర్వేషన్లను పెంచడం వల్ల ఆ రాష్ట్రంలో కోటా 50 శాతం దాటింది. ఈ విషయమై సుప్రీం కోర్టు మరోసారి స్పందిస్తూ కోటా 50 శాతం దాటరాదని స్పష్టం చేసింది.
రిజర్వేషన్లు పెంచి కేంద్రానికి పంపితే దీనికి అనుగుణంగా చట్టం చేయవచ్చు కానీ చివరకు సుప్రీంకోర్టులో నిలువవు. రాష్ట్ర ప్రభుత్వాలు తాము చిత్తశుద్ధితో రిజర్వేషన్లను పెంచడానికి ప్రయత్నించినా సుప్రీంకోర్టు అడ్డుపడిందనే నెపం చూపవచ్చు. రాజ్యాంగ వౌలిక సూత్రానికి ఇది విరుద్ధం. తమిళనాడుకు చెందిన అంశం ఇప్పటికీ సుప్రీంకోర్టు పరిశీలనలో ఉందనే విషయం మర్చిపోరాదు. 50 శాతంకంటే ఎక్కువ రిజర్వేషన్లు ఉంటే, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న రాజ్యాంగంలోని అధికరణ 16కు విరుద్ధమవుతుంది.
పెంపు సాధ్యం కాదు: మోహన్ రెడ్డి
రాజకీయ నాయకులు తెలిసో, తెలియక రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇస్తారు. సుప్రీం కోర్టు రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని గత 50 ఏళ్లలో అనేక సార్లు చెప్పింది. తమిళనాడు కేసు వేరు. 9వ షెడ్యూల్‌లో చేర్చారు. అయినా సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణలో ఉంది. స్టే ఇవ్వలేదు. పార్లమెంటులో రిజర్వేషన్లు పెంచుతూ రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప రిజర్వేషన్లను 50 శాతానికి మించి పెంచలేరు.
12 శాతం పెంపు అసాధ్యం: బిజెపి
మతపరమైన రిజర్వేషన్లు రాజ్యంగ విరుద్ధం. తాజా కోర్టు ఉత్తర్వులు చూసిన తర్వాత అయినా ప్రభుత్వానికి కనువిప్పు కావాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. గతంలో వైఎస్‌ఆర్ ప్రభుత్వం సైతం ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి తర్వాత దానిని 4 శాతానికి తగ్గించుకుందని, అయితే ఆ వివాదం కూడా ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందన్నారు. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు చూసిన తర్వాత అయినా ప్రభుత్వం మోస పూరిత చర్యలకు స్వస్తిపలకాలన్నారు.
మోసం చేయడమే: కాంగ్రెస్ నేత దాసోజు
ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సిఎం కేసీఆర్ చెప్పడం ముస్లింలను మోసం చేయడమేనని టి.పిసిసి ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ అన్నారు.
సిఎంకు చిత్తశుద్ధి ఉంటే ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీని ఒప్పించాలన్నారు. మోసపూరిత ధోరణి కొనసాగిస్తే, మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.